అంధకారంలో పాకిస్థాన్ ఏంటి అని అనుకుంటున్నారా ? అవును పాకిస్థాన్ లో విద్యుత్ సరఫరా లో లోపం తలెత్తడంతో దేశంలోని అన్ని నగరాలలో చీకటి ఏర్పడింది అని అక్కడి అధికారులు తెలిపారు . దాదాపు 20 కోట్ల జనాభా కలిగిన పాకిస్థాన్లో గ్రిడ్ లోని ఒక విభాగంలో వైఫల్యం కారణముగా దేశ వ్యాప్తంగా అంతరాయం కలిగింది .

శనివారం రాత్రి అక్కడి కాలమానం ప్రకారం 11. 41 గంటల ప్రాంతంలో దక్షిణ పాకిస్థాన్ లోని లోపం దినికి కారణం అని ఆ దేశ విద్యుత్ మంత్రి తెలిపారు .దేశంలోని విద్యుత్ వ్యవస్థ లోపంతో అన్ని పవర్ ప్లాంట్స్ మూసివేయవలసి వచ్చిందని , రాజధాని తో సహా అన్ని ప్రధాన నగరాలలో చీకటి అలముకుంది అని అధికారులు తెలిపారు . ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో విద్యుత్ పునరుద్దరించాము , మిగితా చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అధికారులు తెలిపారు .
గతంలో 2015లో లనే జరిగి 80శతం దేశం అందకర్మలోకి వెళ్ళింది . ఇప్పుడు మల్లి దాదాపు దేశం మొత్తం అంధకారమైంది . బ్లాక్ అవుట్ అనే హాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది . ఇలా విద్యుత్ వ్యవస్థ కూలడంతో పాకిస్థాన్ ప్రజలు ట్విటర్ లో 50,000 లకు పైగా ట్విట్ చేసారు . ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కొత్తగా పాకిస్థాన్ ను నైట్ మోడ్ లో పరిచయం చేసాడు అని ట్విట్ చేసాడు ఒక యూజర్ .
కరోనా వాక్సినేషన్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు- Rules