అతి భారీ వర్షాలు : 2 రోజులపాటు బారి వర్షాలు … బయటకు రావద్దు వాతావరణ శాఖ

0
432
అతి భారీ వర్షాలు : ఎడతెరిపి లేకుండా రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడం , వరద నీరు పెరుగుతుండడం, వాగులు , నదులు పెరుగుతుండడంతో అధికారులను , ప్రజా ప్రతినిధులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు .
అతి భారీ వర్షాలు

తెలంగాణలోనే కాకుండా పైన ఉన్న రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు పడుతుండడంతో అక్కడున్న ప్రాజెక్టులు నిండడంతో గేట్ లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు . దానితో కృష్ణ , గోదావరి నదులలో ఉధృతి పెరిగి తెలంగాణాలో ప్రమాదస్థాయి వరద ప్రభావం పెరగనుంది . కృష్ణ , గోదావరి పరివాహక ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేసి , ఎప్పటికప్పుడు సమీక్షించవలసిందిగా ఎమ్యెల్యే లను మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించారు .

అతి భారీ వర్షాలు కారణంగా ఎస్సారెస్పీ నుండి గోదావరికి వరద ఉదృతి పెరుగుతునందున యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలిపారు . ప్రజలకు ఎటువంటి ఆటంకాలు , హాని కలుగకుండా చూడాలని ,గోదావరి పరిహారక ప్రాంత ప్రజలు బయటకు రావద్దని సూచించారు . అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు , ఎస్పీ లకు , రెవెన్యూ అధికారులకు ఆదేశించారు .

108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ : త్వరలోమార్కెట్లోకిరానున్న మోటో జీ 60 ఎస్- Launch