అద్దం 7 లక్షలు ఏంటి అనుకుంటున్నారా ! అదికూడా బాత్రూంలోని అద్దం అంత ఖరీదు ఎందుకు ఉంటుంది అని అనుమానమా ? అయితే ఆ అద్దం దాని చరిత్ర తెలుసుకుందాం .

అద్దం 7 లక్షలు
ఆ కుటుంబం కూడా ఊహించలేదు అద్దం తమకు అంత అదృష్టం తెస్తుందని .అది కూడా బాత్రూములోని అద్దం . ఆ అద్దానికి ఉన్న 40 ఏళ్ళ చరిత్ర ఇప్పుడు ఆ కుటుంబానికి వేలంలో కుటుంబానికి యెనలేని సంతోషాన్ని ఇచ్చింది .
అద్దం చరిత్ర చుస్తే మేరీ ఆంటోనిట్టె ఫ్రాన్స్ చివరి రాణి వాడిన అద్దం అది . 40 ఏళ్ళ క్రితం వాళ్ళ కుటుంబంలోకి వచ్చి అప్పటినుండి అలానే ఉంటుంది . అద్దం ఇటీవల వేసిన వేలంలో 8 పౌండ్లకు అమ్ముడుపోయింది అంటే 7 లక్షల 70 వేలు అన్నమాట .
వేలం వేసిన తూర్పు బ్రిస్టల్ కంపెనీ 19,15 అంగుళాలు ఉన్న ఈ అద్దం 18 వ శతబ్దానికి చెందినది అని గుర్తించింది . అద్దం డిజైన్ 19 వ శతాబ్దంలో చేసినట్టు గుర్తించారు . వెండి ఫలకంతో ఫ్రేమ్ కలిగి ఉంది . ఆ ఫ్రేమ్ మీద మొదట ఆంటోనిట్టె ఆతరువాత నెపోలియన్ మూడోవ భార్య కనుగోలు చేసినట్టు ఉంది .
అయితే ఈ అద్దం వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు ఎలా వచ్చిందో తెలియదు కానీ అప్పటినుండి వారసత్వంగా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఆ అద్దం .
ఏదో పాత అద్దం అని దాన్ని వాళ్ళు బాత్రూం లో ఉంచారు .
ఎంతో అద్భుత చరిత్ర ఉన్న ఈ అద్దాన్ని 18 వ శతాబ్దంలోని ప్రముఖులు దీన్ని వాడారు అని వేలం వేసిన తూర్పు బ్రిస్టల్ కంపెనీ చెందిన ప్రముఖ వ్యక్తి అన్నారు .
Also Read
గ్యాస్ సిలిండర్ బుకింగ్ : నవంబర్ 1 నుండి కొత్త రూల్స్- Rules