అమితాబ్ -ప్రభాస్ కలసి వెండి తెర మీద సందడి చేయబోతున్నారు అని నాగ్ అశ్విన్ ఒక వీడియో ట్వీట్ చేసి ఫాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు .

అమితాబ్ -ప్రభాస్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ 21 వ చిత్రం నిర్మిస్తున్నట్టు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే . ఈ సినిమాని బారి బడ్జెట్ తో సీనియర్ టాలీ వుడ్ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు .
ప్రభాస్ , అశ్వినీదత్ సినిమా అనగానే అంచనాలు పెరిగాయి . దీనికి తోడు హీరోయిన్ దీపికా పదుకొనె అని ప్రకటించగానే ప్రపంచస్థాయి సినిమా కాబోతుంది అని అభిమానులు సంబర పడిపోయారు .
వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ సంబంధించి అన్ని పనులు దాదాపు పూర్తికావొస్తున్నాయి . ఈ సినిమా కోసం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివారు రావు ని తీసుకున్నారు .
ఇప్ప్పుడు చిత్ర యూనిట్ ప్రభాస్ బర్త్డే కి రెండువారాలముందే పెద్ద వార్తను ప్రకటించారు . చెప్పినట్టుగానే శుక్రవారం ఉదయం 10 గంటలకు సినిమా గురుంచి సర్ప్రైజ్ ఇచ్చే విషయం వెల్లడించారు .
లెంజెండ్ లేకుండా లెజెండరీ మూవీ ఎలావుంటుంది అని అబితాబ్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పేసారు . ఇప్పుడు బిగ్ బి సినిమాలో చేరడంతో సినిమా మాములుగా ఉండదు అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు .
ఈ సినిమాలో ప్రభాస్ ,అమితాబ్ పాత్రలు ఎలాఉంటాయి అనేది మాత్రం ప్రకటించలేదు . ఓం ప్రకాష్ రౌత్ నిర్మిస్తున్న ఆది పురుష్ లో ప్రభాస్ రామునిగా నటిస్తున్నట్టు ప్రకటించారు .
అందులో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు .ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఇన్నాయి . ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ దశలో ఉంది .
flipkart – amazon festival sale : అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో 2020 super బిగ్ డిస్కౌంట్ సేల్ – hurry