ఆక్స్ఫర్డ్ టీకా అక్టోబర్ లో రావచ్చు అని పూనావాలా ఆశాభావం వ్యక్తంచేశాడు .కరోనా ను నిలువరించే టీకా ఇదే అని ,ఇది అక్టోబర్ వరకు రావచ్చు అని తెలిపారు .సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా సీఈఓ అయినా పూనమ్ వాలా వీడియో కాన్ఫరెన్స్ లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో మాట్లాడుతూ మొదటి దశ’ కొవి షీల్డ్ ‘ ఆక్సఫర్డ్ టీకా ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయి అన్నారు .

దీని తరువాతి దశ ప్రయోగాలు ఇండియాలో ఆగస్టు లో చేసే అవకాశం వుంది .ప్రపంచం లోనే ఎక్కువ పరిమాణంలో టీకాలు తయారు చేసే SII,ఆక్స్ఫర్డ్ కలసి అభివృద్ధి చేస్తున్న టీకాను ఉత్పత్తి చేసేందుకు బయో ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా తో జతకట్టినట్టు తెలిసిందే .అయితే అదర్ పూనమ్ వాలా టీకా అక్టోబర్ లో వస్తుంది అని చెప్పినప్పటికీ ,SII చైర్మన్ సైరస్ పూనమ్ వాలా ఆక్సఫర్డ్ టీకా డిసెంబర్ లో వస్తుంది అని ,రెండో దశ ప్రయోగాలు ఆస్ట్రియాలో నిర్వహిస్తామని తెలిపారు .కనీసం 100 కోట్ల డోసును పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో ఇండియాలో తీసుకు రావాలనే లక్ష్యాన్ని పెటుకున్నటు తెలిపారు .
ఆన్లైన్ లోవిధ్యుత్ శాఖ మీటర్ రీడింగ్ స్మార్ట్ మీటర్లతో
ICMR,భారత్ బయో టెక్ సంయుక్తం గ తయారు చేస్తున్న దేశీయ టీకా ‘కోవాక్జిన్’ ప్రయోగాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే .ఇదికూడా ఆగస్టు 2020 15 కల్లా వచ్చే అవకాశం వుంది అని ప్రకటించారు . రష్యా కూడా వాళ్లు అభివృద్ధి చేసిన టీకా ఫలితాన్ని ఇస్తుందని ఇంకా ఒకటి రెండు ప్రయోగాలతో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు .ఇటీవలే ట్రంప్ కూడా తొందరలోనే వ్యాక్సిన్ రాబోతుంది అని ప్రకటించాడు .ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం 2021 తరువాతే వ్యాక్సిన్ వచ్చే అవకాశం వుంది అని ప్రకటించడం విశేషం