ఆదిలాబాద్ లో కాల్పులు…తుపాకీ తల్వార్ తో హల్ చల్ చేసిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్. పాతకక్షల కారణంగా వాగ్వాదం తుపాకీతో ఇద్దరిపై కాల్పులు జరిపాడు .

ఆదిలాబాద్ మాజీ మునిసిపల్ చైర్మన్ అయినా ఫారూఖ్ అహ్మద్ గన్, తల్వార్ తో వీరంగం సృష్టించాడు . మోసిన్ అనే యువకుడికి బుల్లెట్ తగలడంతో పరిస్థితి విషమంగ ఉంది . మరో ఇద్దరికి కూడా బులెట్ గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు .
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు . కాల్పుల ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పాతకక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగి అది కాల్పులకు దారి తీసినట్టు తెలుస్తుంది . రిలో ఒకరి తల, మరొకరికి పొట్ట భాగంలో బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఎంఐఎం నేతను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు .
బండి సంజయ్ తెరాస ,ఎంఐఎం లేని హైదరాబాద్ ఏర్పర్చుకుందాం
adilabad firing case … 3 injured pic.twitter.com/QZX1orgHQg
— wakeupTelugu (@WakeupTelugu) December 18, 2020