ఇండోనేషియాలోమాస్క్ లేకపోతే వెరైటీ శిక్ష -Jakartha

3
1144

ఇండోనేషియాలోని జకర్తాలో మాస్కులు ధరించిన వారికి అధికారులు విన్నూత్న శిక్ష అమలు పరుస్తున్నారు. అక్కడి ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రచారం చేస్తున్నారు.

అయితే ప్రభుత్వం ఎంత చెప్పినా చాలామంది ప్రజలు ఇప్పటికీ మాస్కులు ధరించడం లేదు. దీంతో అధికారులు జరిమానా విధించకుండా వెరైటీ శిక్ష అమలు పరుస్తున్నారు.

ఆ శిక్ష ఏమిటి అంటే కరోనాతో చనిపోయిన వాళ్ల కోసం సమాధులు తీయాలని ఆదేశిస్తున్నారు. జకర్తా నివేదికలోని ఒక పోస్ట్ ప్రకారం తూర్పు జువా లోని గ్రేసిక్ రీజెన్సీ లో చాలామంది మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతూ ఉండటంతో ఈ శిక్షణ అమలు పరుస్తున్నారు.

ప్రస్తుతం అక్కడ సమాధులు తీసేవారు చాల తక్కువగాఉండడం, మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అధికారులు ఈ ఆలోచన చేశారు. మాస్కులు ధరించని వాళ్ళకి స్మశానంలో ఈ పని అప్పగిస్తున్నారు. సమాధి చేయడానికి ఇద్దరినీ వినియోగిస్తారు. ఒకరు మట్టి తీస్తే ఒకరు చెక్క పెట్టెను అమరుస్తాడు .
అయితే అధికారులు ఈ శిక్ష మంచి ప్రభావం చూపించగలదు అని భావిస్తున్నారు .

అక్కడి చట్టాల ప్రకారం జరిమానా లేదా సమాజసేవ చేయించడం తప్పు చేసిన వారికి విధించడం జరుగుతుంది. రోజు రోజుకి కొరోనా కేసులు పెరుగుతుండడంతో మళ్లీ సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొత్తం కరోనా కేసులు దాదాపు రెండు లక్షల 18 వేలు ఉన్నాయి. అందుకనే ప్రజలలో క్రమశిక్షణ ఏర్పడేందుకు ఇలాంటి శిక్ష అమలు పరుస్తున్నారు .

భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో కాంటీన్ మెను మరియు ధరలు తెలుసుకోండి

3 COMMENTS

Comments are closed.