ఈటెల రాజేందర్ రాజీనామా : అందరు అనుకున్నట్టే ఈటెల ఢిల్లీ పర్యటన నుండి వచ్చిన తరువాత రాజీనామా చేస్తారు అన్నట్టుగానే శుక్రవారం తన ఎమ్యెల్యే పదవికి , పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు . ఈటెలతో సీనియర్ నేత ఏనుగు రవీందర్ కూడా ఉన్నారు .

ఈటెల రాజేందర్ మీడియా తో మాట్లాడుతూ భావోద్వేగం గురయ్యారు . ఎవరో అనామకుడు లేక రాస్తే మంత్రి పై విచారణ జరుపుతారా . బీఫామ్ ఇస్తే అందరు గెలవారు . అలాంటిది నేను తెల్లనగానకోసం ఎన్ని సార్లు రాజీనామా చేసి నిలబడిన నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు . ఇప్పటికి ప్రజల గుండెల్లో న స్థానము పదిలంగానే ఉంది . ఉద్యమ కారులను గెలిపించే సాంప్రదాయం కరీంనగర ప్రజలకు ఉంది అన్నారు .
మంత్రి పదవి ఇస్తే అనిగి ,మనిగి పనిచేయాల్నా . నాకు పదవులు అడిగే రాలేదు .ప్రగతి భవన్ బానిస భవన్ గా మారిపోయింది . కేసీఆర్ డబ్ లేక్ ప్రాధాన్యత ఇస్తున్నాడు . తెలంగాణ ఉద్యమాల్లో సంఘాలు కావాలని అన్న కేసీఆర్ ,ఇప్పుడు ఉన్న సంఘాలను లేకుండా చేస్తున్నాడు . నన్ను అణగదొక్కామని కేసీఆర్ స్వయంగా ఆదేశాలు ఇచ్చారు .
బానిసకంటే హీనమైనది మంత్రి పదవి . ఎన్నో అవమానాలను దిగమింగుకున్నాను . నాకన్నా హరీష్ రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు . హుజురాబాద్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తెరాస ను గెలిపించాను . పార్టీ వాళ్ళ నేను గెలిచాను అంటే , పార్టీ బీఫామ్ తీసుకున్న కవిత ఎలా ఓడిపోయింది . చైతన్యం చంపేస్తే ఉన్మాదం పెరుగుతుంది అని చెప్పిన అది చెప్పటం తప్పా . నీకు దిక్కు లేనప్పుడు సాయం చేసిన వాళ్లే ఇప్పుడు నీకు శత్రువులు అయ్యారా అని ఈటెల రాజేందర్ రాజీనామా సందర్భంగా అన్నారు