ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లుక్ అదిరింది. ఎట్టకేలకు ఎపుడు ఎప్పుడు అని ఎదురుచూసున్న ఎన్టీఆర్ లుక్ విడుదల చేసారు .

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లుక్
ఎన్టీఆర్ అభిమానులు గత ఐదు నెలలు గా ఎదురుచూస్తున్న కొమరామ్ బీమ్ లుక్ ను దర్శకుడు రాజమౌళి విడుదలచేశారు . చెప్పిన విధంగానే గురువారం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్టీఆర్ కొమరం బీమ్ ఫస్ట్ లుక్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు .రాజమౌళి స్టైల్ లో అభిమానుల అంచనాలకు తగ్గకుండా వుంది ఈ లుక్ .ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ ని చూపించిన విధానం మనం ఊహించిన దానికనే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు .
రాంచరణ్ వాయిస్ తో ఎన్టీఆర్ లుక్ విడుదల చేసారు .” ఆడు కనపడితే సముద్రాలు తడపడుతాయి . నిలపడితే సామ్రాజ్యాలు సాగిలా పడతాయి. వాడి పొగరు ఎగిరే జండా . వాడి దేర్యం చీకట్లు చీల్చే మండుటెండ,వాడు బూతల్లి చను పాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ ,నా తమ్ముడు గోండ్రు బొబ్బిలి కొమరం భీం ” రాంచరణ్ వాయిస్ లో ట్రైలర్ అధర గొట్టిండు రాజమౌళి . రాంచరణ్ అల్లూరి ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే .
రేటు తేలిన కండలు , మొరటు బాడీ , ఆక్రోశం , కళ్ళలో కసి ఉన్న ఎన్టీఆర్ పాత్ర ఎలాఉంటుందో ఊహించగలం .ఒక వీరుడు అన్యాయానికి వ్యతిరేకంగా కొమరం భీం గా మారుతూ కఠోర శిక్షణ చేస్తున్నట్టు చూపించారు .
రాజమౌళి డైరెక్షన్లో డి వి విప్ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు .అలియా బట్ ,ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు . బాలీ వుడ్ నాయుడు అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు .అతనికి జంటగా శ్రేయ నటిస్తుంది . సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు .కానీ కరోనా వాళ్ళ ఆలస్యం అయింది . విడుదల తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు .
Also Read
HYDERABAD FLOODS : నగరంలో 15 ప్రత్యేక బృందాల ఏర్పాటు సీఎం కేసీఆర్