ఎపి డీజీపీ : రాష్ట్రంలోని హోంగార్డ్స్ అద్భుతమైన నిస్వార్ద సేవలు చేస్తున్నారు- Satisfied

0
695
ఎపి డీజీపీ శ్రీ గౌతం సవాంగ్ IPS 58వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రానికి హోంగార్డులు అద్బుతమైన నిస్వార్ధ సేవలను అందిస్తున్నారన్నారు.ఈ స్వచ్చంద సేవా సంస్థలో హోంగార్డులు భాగస్వాములై, సమాజసేవలో పోలీసులతో కలిసి పని చేయటం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము అని అన్నారు .
ఎపి డీజీపీ


హోంగార్డ్స్ అగ్ని ప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు స్వచ్ఛందంగా సేవా దృక్పథంతో విధులు నిర్వహించటం ప్రభుత్వం గుర్తిస్తుంది అని సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడాన్ని అభినందిస్తున్నాను అని డీజీపీ అన్నారు .
హోంగార్డుల సంక్షేమం, వారి పిల్లల విద్యా, వైద్యం, కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైస్.జగన్ మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను అమలుచేస్తున్నాము. నెలసరి భత్యం పెంపు, ప్రమాద బీమా వర్తింపు,రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నెలసరి భత్యం పెంపు బీమా వర్తింపు ,హోంగార్డు సామాజిక ఆర్థిక స్థితి అనేక రెట్లు పెంచడంతోపాటు ఎన్నడూ లేని విధంగా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం.
హోంగార్డుల రోజువారీ భత్యం రూ .600 / – నుండి 710 / – కు పెంచాం.


ప్రస్తుతం వారు గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకు భత్యం రూ.18 వేల నుంచి 21,300 / – కు పొందుతున్నారు.అంత్యక్రియల ఛార్జీలు గతంలో ఉన్న రూ.1000 నుండి రూ10,000 అందిస్తున్నాము. 15000 హోంగార్డు కుటుంబాలకు యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేయడం జరిగింది.
ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఆకస్మిక మరణం సంభవిస్తే 30 లక్షలకు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచాలని ఆలోచిస్తున్నాము . వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ఈ ఏడాది 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. హోంగార్డుల సరైన ఆరోగ్య సంరక్షణ కోసం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు 12005 మంది హోంగార్డులకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులు జారీ చేయబడ్డాయి.మహిళా హోంగార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నాము. ఆరోగ్య సంరక్షణ లో భాగంగా ప్రతి ఒక్క హోంగార్డుకు EHS/Arogyasri అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. “అందరికీ హౌసింగ్” పథకం కింద ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు అర్హత ఉన్నవారికి ఇళ్లను కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హోంగార్డులు అంకితభావంతో సేవా దృక్పథంతో సగర్వంగా సమాజ సేవకు పోలీసు శాఖతో కలిసి పనిచేస్తున్నారు. వీరి సేవలను సమాజ అభివృద్ధిలో భాగంగా కష్టపడి అంకితభావంతో పనిచేయాలని వారి సేవలను ప్రజలు సమాజం ప్రభుత్వం గుర్తించింది.హోంగార్డ్స్ తమకు అప్పగించిన బాద్యతలను సేవా భావంతో నిర్వర్తించి అందరికీ మార్గదర్శకంగా నిలచినట్లు ఎటువంటి క్లిష్టమైన బాధ్యతలు అప్పగించినా పనిచేయడానికి హోంగార్డ్స్ ముందుండాలని, ప్రజాసేవయే మా కర్తవ్యం అన్న విషయాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని హోంగార్డ్స్ లు తమ విధులును అంకితభావంతో అందించి ప్రజల యొక్క మన్ననలను పొందుతున్నట్లు మరియు భవిష్యత్తులో అంకిత భావంతో మంచి సేవాధృక్పధంతో ముందుకుసాగి ప్రజల మన్ననలు పొందాలని ఆశిస్తున్నాను ఎపి డీజీపీ శ్రీ గౌతం సవాంగ్ .

జీహెచ్ఎంసి కొత్త మేయర్: సిందురెడ్డి కి సీఎం పిలుపు.. పదవి కోసమేనా ? Results