ఏపి కేబినెట్ డెడ్ లైన్ : రెండున్నరేళ్లు పూర్తవుతుండడంతో మంత్రులలో గుబులు- Tense

0
2736
ఏపి కేబినెట్ డెడ్ లైన్ : జగన్ మంత్రివర్గం ఏర్పర్చినప్పుడే రెండున్నరేళ్ల సమయం పెట్టారు .ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతూవుండటంతో మంత్రులలో కలవరం మొదలయింది . మంత్రి వర్గ మార్పు జరుగుతుందా , జరిగితే ఎప్పుడు జరుగుతుంది . అసలు జగన్ ఏమి ఆలోచిస్తున్నాడు అని అందరిలో చర్చ జరుగుతుంది . జగన్ అందరికి మంత్రి వర్గ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రపోసల్ పెట్టాడు అప్పుడు . మరి ఇప్పుడు జగన్ ఉన్న వారందరిని మార్చి కొత్త వారిని నియమిస్తాడా లేక కొత్త ఆలోచన చేస్తాడా ?
ఏపి కేబినెట్ డెడ్ లైన్

జగన్ ప్రభుత్వంలో పాలనాపరంగా బారి మార్పులు జరగబోతున్నట్టు సమాచారం . ఉన్న మంత్రి వర్గాన్ని ఒకేసారి మార్చాలని ముఖ్యమంత్రి చూస్తున్నట్టు సమాచారం . వైసీపీలోని సీనియర్ నాయకులలో దీనిపై మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తుంది . ఒకవేళ అందరిని మారిస్తే విలందరికి ఎలాటి పార్టీ బాధ్యతలు ఇస్తారు అనేది చూడాలి

ఇప్పుడున్న మంత్రి వర్గంలో చాల వరకు సీనియర్‌ నాయకులూ ఉన్నారు . వలందరిని ఇంచార్జి లుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది . పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాయలసీమ జోన్‌ ఇన్‌చార్జిగా , దక్షిణ కోస్తా జోన్‌ ఇన్‌చార్జిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా బొత్స సత్యనారాయణలను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం . కృష్ణా, ఉభయ గోదావరితో కూడిన జోన్‌ ఇన్‌చార్జిగా కన్నబాబు లేదా కొడాలి నాని నియమించే అవకాశం ఉంది .

ముఖ్యమంత్రి తో పాటు 25 మంది మంత్రులు ఉన్నారు . ఏపి కేబినెట్ డెడ్ లైన్ కొంత మందిని ఉంచి మిగితావారిని తొలగిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది . కాబట్టి 25 మందిని పార్టీకి ఉపయోగించుకోవాలని అధినేత భావిస్తున్నట్టు తెలుస్తుంది .

2024 లో గెలుపే లక్ష్యంగా అందరిని నియోజకవర్గ ఇంచార్జ్ లుగా నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది . పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ గెలిపించాలని అప్పుడు మల్లి వచ్చే ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తామని జగన్ భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .
సీనియర్ నాయకులను తొలగిస్తే రాజకీయముగా ఎండిన ప్రాబ్లెమ్ రాకుండా వారికీ సముచిత పదవులను అప్పచెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . వైసిపి అధినేత ఈ నిర్ణయం రాజకీయంలో సంచలమనే చెపుకోవచ్చు . చూడాలి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అది పార్టీకి ఎలాంటి లాభం చేకూరుతుంది , 2024 లో గెలుపు బాటకు ఇది మార్గం అవుతుందా వేచిచూడాలి .

హీరో నాని : నేనే బ్యాన్ చేసుకుంటా .. ఎవరు చేయవలసిన అవసరం లేదు- Clarity