ఏపీకి ఆర్టీసీ బస్సులు : ప్రారంభమైన అంతరాష్ట్ర సర్వీసులు

0
481

ఏపీకి ఆర్టీసీ బస్సులు : తెలంగాణాలో ఆదివారం నుండి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంబమయ్యాయి . దీనితో పాటు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కూడా మొదలుపెట్టారు .

ఏపీకి ఆర్టీసీ బస్సులు

సోమవారం నుండి కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ కు బస్సుల సర్వీసు మొదలుపెట్టనుండగా , మంగళవారం నుండి మహారాష్ట్రకు ప్రారంభించనున్నారు . అయితే ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మినహాయింపు ఇవ్వడం తో ఆ సమయంలో ఆంధ్రలోకి వెళ్లి తిరిగి తెలంగాణ సరిహద్దుల్లోకి వచ్చేయాలి . ఆ విధంగా తెలంగాణ ఆర్టీసీ ప్రణాళిక చేసుకుంది .

కర్ణాటకకు బస్సులు తిరుగుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో బస్సులు నడవడంలేదు. బెంగుళూరు , మైసూర్ ప్రాంతాలకు అనుమతి లేదు . మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్తున్నాయి . ముంభై , పుణేలకు నడిపే అవకాశం లేదు .

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !