ఏపీ ఆరోగ్యశాఖ: 50 మందికి మించి వేడుకలు చేసుకోరాదు

0
629
ఏపీ ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది . కరోనా వ్యాప్తి అధికమవుతున్న తరుణంలో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంటుంది . వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు .
ఏపీ ఆరోగ్యశాఖ

ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వేడుక చేసుకున్న 50 మందికే అనుమతి ,క్రీడా ప్రాంగణాలు ,ఈత కొలనులు , జిమ్ లు తాత్కాలికంగా మూసివేయాలని తెలిపారు . 50 శాతం ఉండేలా సినిమా హాల్స్ కు , ప్రజారవాణాకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు .
ఆఫీస్ లలో 50 గజాల దూరం ఉండేలా చూసుకోవాలని ,ఆసుపత్రులలో అడ్మిషన్స్ , పడకల కేటాయింపులు ఒకే కాల్ సెంటర్ ద్వారా జరగాలి అన్నారు . కేంద్రం రాష్ట్రానికి ఆక్సిజన్ 341 టన్నులు కేటాయించింది అని తెలిపారు . ఆ ఆక్సిజన్ సరిపోవడంలేదు . చాల చోట్ల వృధా అవుతుంది ,అవసరం లేకపోయినా వాడుతున్నారు అని తెలిపారు . 11వేల రెమ్ డెసివిర్ అందుబాటులో ఉన్నాయి . వాటి పర్యవేక్షణకోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసాము అన్నారు .ఏపీ ఆరోగ్యశాఖ ఎప్పటికప్పు అన్ని పర్యవేక్షిస్తుంది అని తెలిపారు .

మన పేరుమీద ఫోన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో ఇలా తెలుసుకోండి