ఏపీ సీఎం జగన్ సర్వే : ప్రభుత్వ ,మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్టానం దృష్టి- Focus

0
1876
ఏపీ సీఎం జగన్ సర్వే : జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావస్తూ ఉండడంతో సీఎం ప్రభుత్వ ,మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే మొదలు పెట్టాడు . తమ అభిప్రాయం తెలపాలంటూ ద్వితీయ శ్రేణి నేతలకు మెసేజ్‌లు వస్తూ ఉండడంతో ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తుంది . వివరములలోకి వెళ్తే ….
ఏపీ సీఎం జగన్ సర్వే

మొన్న జరిగిన కౌంటింగ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వైసీపీ కి ఏకపక్షంగా వచ్చాయి .అలాగే స్థానిక సంస్థలకు జరిగిన వరుస ఎన్నికల్లో వైసిపి ఘనవిజయమే సాధించింది. ప్రతి ఎన్నికలలో గెలిచినా అసలు ప్రజల మనుసులో ఏముందో తెలుసుకోవాలని వైసీపీ అధిష్టానం కోరుకుంటుంది . దీర్ఘకాలికంగా అధికారం పొందే దిశగా జగన్ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది . ఇప్పుడు ఈ విషయమే నాయకులకు కాక రేపుతోంది .

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండనే ప్రచారంపై అధిష్ఠానం దృష్టిసారింనట్టు తెలుస్తుంది . అందుకే ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక మంత్రుల పనితీరుపై పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగానే చైర్మన్లు, డైరెక్టర్లుగా,పార్టీ నేతలు, కార్పొరేషన్లకుసెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు వస్తున్నాయి అంట .

వైసీపీ భారీ 2019లో జరిగిన ఎన్నికల్లో ఆధిక్యంతో విజయం సాధించింది. అప్పుడు వైసీపీకి మద్దతు తెలిపిన పక్షం వారి వైఖరిలో మార్పు వస్తుంది అని , పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో అధిష్ఠానం తీరుపై వ్యతిరేకత పెరుగుతుందని రెపొర్స్ వస్తున్నాయి అని తెలిసింది .ఇలాంటి సమస్యలను తొలిగించకపోతే , ఇదే పరిస్థితి కొనసాగితే 2024 ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం కష్టమనే భావనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది .

ఒక పద్దతిలో నేతల అభిప్రాయాలు తీసుకోవాలని జగన్ భావిస్తునట్టు తెలుస్తుంది . వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌ మళ్లీ ప్రజల్లో సర్వే చేసే అవకాశం వుందనే ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఏపీ సీఎం జగన్ సర్వే ప్రారంభించడం పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .

భారత్ VS పాక్ మ్యాచ్ : టీ -20 వరల్డ్ కప్ లో ఏరోజు అంటే ?