ఏలూరులో వింత రోగం తో బాధితులు ఆసుపత్రుల వైపు పరుగులు పెడుతున్నారు . వందల సంఖ్యలో తెలియని రోగంతో సతమత మవుతున్నారు . వింత రోగం కారణాలు తెలియక పోవటంతో ఏలూరులో కలకలం రేగింది .

ఏలూరులో అస్వస్థతకు గురైనవారిని సీఎం వైయస్.జగన్ పరామర్శించారు . ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను కలుసుకొని ధైర్యం చెప్పారు . అన్ని విధాలుగా బాధితులకు అండగా ఉంటామని సీఎం భరోసా నిచ్చారు . వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకున్నారు . ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమైన సీఎం వైయస్.జగన్ సమస్యపై చర్చించారు .
అస్వస్థతకు గురైన వారికి ఎలాంటి వైద్య సహాయం ఇస్తున్నారు ,తీసుకున్న చర్యలను ,అస్వస్థతకు దారితీసిన కారణాలపై అడిగి తెలుసుకున్నారు . ఇప్పటివరకూ చేసిన పరీక్షల వివరాలను అడిగారు .
అధికారులు వివరణ ఇస్తూ తాగునీటిపై పరీక్షలు చేయించామని, రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని ,హెవీమెటల్స్పైనకూడా పరీక్షలు చేశామని అవికూడా సాధారణస్థాయిలోనే ఉన్నాయని తెలిపారు .
వివిధ రోగాలకు కారణ మవుతున్న వైరస్లపై అన్ని పరీక్షలు చేశామని, అవన్నీకూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయని తెలిపిన ,బ్లడ్ కల్చర్ రిపోర్టు రావడానికి కొంత సమయం పడుతుందని, వాటి ఫలితాలకోసం వేచి చూస్తున్నామని ,సీటీ స్కాన్ రిపోర్టులు కూడా సాధారణంగానే ఉన్నాయని ,అస్వస్థతకు కారణాలు తెలియరాలేదని అధికారులు సీఎం కి తెలిపారు
ఏలూరు అర్బన్ ప్రాంతంలోనే కాకుండా ఏలూరు రూరల్, దెందులూరు పరిధిలోకూడా కేసులు గుర్తించామని ,పలానా వయస్సు ఉన్నవారికిమాత్రమే అస్వస్థత రావడంలేదని, అన్ని వయస్సులు వారూ ఉన్నారని ,నీళ్లు వేడిచేసుకుని తాగేవారుకూడా అస్వస్థతకు గురవుతున్నారని, అలాగే మినరల్వాటర్ తాగేవారికీ ఈ వ్యాధి వస్తుందని తెలిపారు .
ఎయిమ్స్ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని, ఇవాళ ఐఐసీటీ, ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ నుంచి కూడా బృందాలు వస్తున్నాయని అధికారులు సీఎం కి తెలిపారు . డిశ్చార్జిచేసిన వారిలో తిరిగి ఆస్పత్రికి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అనిసీఎం అడగడంతో ముగ్గురు తిరిగి అధికారులు తెలిపారు . డిశ్చార్జి చేసిన వారినికూడా అబ్జర్వేషన్లో ఉంచాలని
డిశ్చార్జి అయిన వారికి సరైన ఆహారం, మంచి మందులు అందించాలని సీఎం అధికారులకు సీఎం ఆదేశించారు .
ఎయిమ్స్ సహా ఐఐసీటీ, ఎన్ఐఎన్ బృందాలు వచ్చాక వారి పరిశీలనలనూ పరిగణలోకి తీసుకోని , ఏలూరులో వింత రోగం ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా ఉండాలని ,వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఏలూరులో ఉండాలని సీఎం ఆదేశించారు . ఎవరికి ఏం వచ్చినా 104, 108 నంబర్లకు కాల్చేసేలా అవగాహన కల్పించాలని, కాల్ వచ్చిన వెంటనే వారికి వైద్యం అందేలా చూడాలని సీఎం అధికారులకు తెలిపారు .
సమీక్షా సమావేశానికి మంత్రులు ఆళ్లనాని, శ్రీరంగనాథ రాజు తానేటి వనిత, పేర్నినాని ,వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనికుమార్ సింఘాల్, వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సహా పలువురు అధికారులు హాజరు అయ్యారు .
పవన్ కళ్యాణ్ దీక్ష :ఏపీ తుఫాన్ బాధితులకోసం ఒక్కరోజు దీక్ష- responsible