
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మాతృమూర్తి కరీమా బేగం ( కస్తూరి) అనారోగ్యంతో చెన్నయిలో కన్నుమూసింది . ఆమె భర్త పేరు రాజగోపాల కులశేఖరన్ మ్యూజిక్ కంపోసర్. రెహమాన్ తండ్రి మలయాళం సినిమాలకు సంగీతంను అందించారు . దాదాపు 52 సినిమాలకు మ్యూజిక్ అందించారు . రెహమాన్ చిన్నపుడు అంటే 9 సంవత్సరములు ఉన్నపుడు రాజగోపాల్ మరణించారు .చిన్నపుడు దిలీప్ గ పిలిచే రెహమాన్ తరువాత ఏ ఆర్ రెహమాన్ గ ప్రపంచ ఖ్యాతి గడించాడు . చిన్నప్పడినుండే కీ బోర్డు ప్లేయర్ గా ఇళయరాజా గ్రూప్ లో చాల సినిమాలకు పనిచేసాడు . తరువాత చిన్న చిన్న యాడ్ లకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ మణిరత్నం దృష్టిని ఆకర్షించాడు . వారిద్దరి కలయికలో వచ్చిన రోజా సినిమాతో మొదలయిన రెహమాన్ ప్రయాణం ఇప్పటివరకు వెనుక తిరిగి చూడలేదు . ఎప్పుడు ఇంటర్వ్యూ లలో తనకు అమ్మ అంటే ఎంత ఇష్టమో చెపుతూ ఉండేవాడు . అలాంటిది ఇప్పుడు మాతృవియోగం తీరనిలోటు అని చెప్పవచ్చు .