ఐపీఎల్ కొత్త జట్లు : వాటి ధర ఎంత అంటే ? wow

0
2932
ఐపీఎల్ కొత్త జట్లు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్ల సంఖ్యను పెంచాలని బీసీసీఐ కొంత కాలంగా ప్రణాళికలు రచిస్తునే వస్తుంది . ఈ వ్యవహారాన్ని జులై లో ముగించేందుకు సిద్దమవుతుంది . ఇప్పుడు ఉన్న 8 జట్లకు మరో రెండు కొత్త జట్లు చేర్చేందుకు సమాయత్తమవుతుంది .
ఐపీఎల్ కొత్త జట్లు

ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన ఐపీఎల్ విలువ ప్రతీ ఏటా పెరుగుతూనే ఉంది . బీసీసీఐ మరో రెండు కొత్త ప్రాంచైజీ లను విక్రయించేందుకు సిద్ధమైంది . వీటి ధర చాల ఎక్కువగానే ఉంది . దాదాపు ఒకొక్క జట్టు ధర 2000 కోట్లు వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు . కొత్త ప్రాంజైజీ లను కొనేందుకు ప్రముఖ వ్యాపారవేత్తలు ఆసక్తి చూపడం విశేషం . రెండో దశ ముగియకముందే బీసీసీఐ బిడ్ లను ఆహ్వానించేందుకు రెడీ అవుతుంది .

ఒక వ్యాపార సంస్థ సీఈఓ మాట్లాడుతూ ఈ అవకాశం కోసం చాల రోజుల నుండి ఎదురు చూస్తున్నాము . కొత్త జట్టు ధర 250 మిలియన్ డాలర్స్ వరకు ఉండచ్చేమో అని అన్నారు . అయినా కొనుగోలుకు సిద్ధం అవుతుండడం చూస్తుంటే ఐపీఎల్ కి యెంత డిమాండ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు . ఇప్పుడున్న జట్లకు ఐపీఎల్ కొత్త జట్లు చేరితే క్రికెట్ అభిమానులకు పండగే పండగ .

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు : రానాదగ్గుబాటి హోస్ట్?ప్రారంభ తేదీ ఫిక్స్