ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ శనివారం ప్రారంభం అవుతుంది .ఎట్టకేలకు మ్యాచ్లు మొదలవుతుండడం తో అభిమానులు ఆనందపడుతున్నారు .మొదటి మ్యాచ్ రోహిత్ కెప్టెన్ గ ముంబై ఇండియన్స్ మరియు ధోని కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ తలపడ పోతున్నాయి .ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది .
రైనా ,హరిభజన్ టీం కి దూరమవడం చెన్నై కి కొంత ప్రతికూల అంశం అని చెప్పుకోవాలి .ధోని కూల్ కెప్టెన్సీ మీదే టీం నమ్మకం పెట్టుకుంది .13 మంది కరోనా బారిన పడిన ధోని ఆధ్వర్యంలో సమస్య నుండి గట్టెకింది .ధోని ఈసారి టైటిల్ కొట్టి నాలుగు సార్లు గెలిచినా ముంబైని సమం చేయాలి అనుకుంటుంది . చెన్నై లో ఐదుగురు కీలక ఆటగాళ్లు విజయంలో ముందుడే అవకాశం ఉంది . ఏం ఎస్ ధోని , అంబటి రాయుడు ,రవీద్ర జడేజా ,ఇమ్రాన్ తాహిర్ ,డ్వెన్ బ్రేవో మంచి కీలక ఆటగాళ్లు .
ముంబై ఇండియన్స్ లో కూడా మంచి అల్ రౌండర్స్ ఉండడం మంచి బలం గా టీం కనిపిస్తుంది . ఆస్ట్రేలియా హిట్టర్ క్రిస్ లీన్ చేరడంతో ముంబై ఇంకా పటిష్టం అయింది . ఓపెనింగ్ రోహిత్ ,డికాక్ లు చాల మంచి ఆరంభాని ఇస్తూఉండడం కూడా ముంబై గెలుపునకు ఒక కారణం గా చెప్పుకోవచ్చు .ముంబై బౌలింగ్ లో బ్యాటింగ్ లో సమాన ప్రతిభ ఉండడం పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు . ఈ మ్యాచ్ లో ఇద్దరు సమన బలాలు కల్గి ఉన్నారు .మ్యాచ్ ఉత్కంఠత గా జరుగుతుందనడంలో సందేహంలేదు