కరెంటు యాప్ : విద్యుత్ అంతరాయంల పిర్యాదు ఇలా చేయండి- Useful

0
660
కరెంటు యాప్: ఎర్రగడ్డలో విద్యుత్ శాఖ స్కాడా కార్యాలయంలో విద్యుత్ అంతరాయంల పిర్యాదు కోసం ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది . ఇది 24 గంటలు పనిచేస్తుంది . సాధారణం గ ఈదురు గాలి దుమ్ములు ,వర్షాలు కురిసినప్పుడు కరెంటు పోతుంది . మనం టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేస్తే అది అసలు కలవటం లేదు అనేది వినియోగ దారుల పిర్యాదు . దానికోసం విద్యుత్ శాఖ ఒక యాప్ ని ఏర్పాటు చేసింది . దానిలో మనం ఏంచేయాలి ఎలా పిర్యాదు చేయాలో తెలుసుకుందాం .
కరెంటు యాప్


మనకి ఎప్పుడైనా కరెంటు పొతే మనం టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి కాల్ చేస్తాము .కానీ అది ఎంగేజ్ లో ఉండడంతో లేదా కలవక పోవడమో జరుగుతుంటుంది . ఎందుకంటె కాల్ సెంటర్ సామర్థ్యం 30 సీట్లు మాత్రమే ఉంది . మనం కాల్స్ కు 60 కంటే ఎక్కువ సంధానం ఇవ్వలేరు . కానీ వినియోగ దారులనుండి ఒకేసారి 3000 లకి పైన కాల్స్ వస్తున్నాయి . కాల్ సెంటర్ కి వచ్చిన ఫిర్యాదులను సిబ్బందికి చేరవేయటం లో కూడా జాప్యం జరుగుతున్నది .
దీనికి పరిష్కారంగా టీఎస్ ఎస్పీ డీసీఎల్ కరెంటు యాప్ ను అప్డేట్ చేసింది . దీని ద్వారానే విద్యుత్ పిర్యాదులు చేయాలనీ విద్యుత్ అధికారులు అంటున్నారు . ఈ యాప్ లో ఇంకా అనేక కొత్త సేవల్ని ప్రవేశ పెట్టినట్టు చెపుతున్నారు .

పిర్యాదు ఎలా చేయాలి అంటే

దీనిలో పిర్యాదు చేయడం చాల సింపుల్ . మన యూనిక్ సర్వీస్ నెంబర్ , మొబైల్ నెంబర్ ముందే రిజిస్టర్ అయి ఉంటాయి . యాప్ లోకి వెళ్లి కస్టమర్ సర్వీసెస్ నొక్క గానే నోపవర్ కంప్లైంట్ ఉంటుంది దానిమీద నొక్క గానే మన యూనిక్ సర్వీస్ నెంబర్ పేరు వస్తుంది . అప్పుడు సబ్మిట్ నొక్కగానే పిర్యాదు రిజిస్టర్ అవుతుంది . స్థానిక సిబ్బందికి వెంటనే సమాచారం వెళుతుంది . వారు వచ్చి మన సమస్యను పరిష్కరిస్తారు . మన ఇంట్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ప్రాబ్లెమ్ ఉన్న గెస్ట్ యూజర్ లోకి వెళ్లి పిర్యాదు చేయాలి . విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏ సమస్య ఉన్న హోమ్ పేజీ లో రిపోర్ట్ హస్ అనే ఆప్షన్ లోకి వెళ్లి ఫొటోస్ , వీడియోస్ ద్వారా పిర్యాదు చేయవచ్చు

ప్రాణం తీసిన విండో సీట్ : సిటీ బస్సులో అచేతనంగా వ్యక్తి … పోలీస్ ఆరాలో షాకింగ్