కరోనా వాక్సిన్ ఎవరు వేసుకోవాలి .. ఎవరు వేసుకోవద్దు- Advice

0
544
కరోనా వాక్సిన్ : కరోనా విజృంభణ చేరినప్పటి నుండి దానికి వాక్సిన్ తయారీని యుద్ధ ప్రాదికన మొదలు పెట్టి ఇప్పుడు అనేక దేశాలతో సహా భారత దేశంలో కూడా ప్రజలకు వాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేసిన సంగతి తెలిసిందే . చాల వరకు వాక్సిన్ మొదటి డోసును వేసుకొని ఉన్నారు . అయితే ఈ టీకా లపై పలు అనుమానాలు వ్యక్త మవుతున్న తరుణంలో ఎలాంటి సందర్భాలలో టీకాలు వేసుకోకూడదో నిపుణులు వివరిస్తున్నారు . ఆ వివరాలు చూద్దాం
కరోనా వాక్సిన్

టీకాలు వెయ్యడం మొదలు పెట్టినప్పటి నుండి టీకాలు తీసుకోవడం ఫై పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి . టీకాలు ఎవరికి వెయ్యాలి , ఎవరికి వేస్తె సురక్షితం , చిన్న పిల్లలకు ఎందుకు వేయటంలేదు అని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి . వ్యాక్సిన్ లు వచ్చాయని తొందర పడకూడదు. ముందు మన ఆరోగ్య పరిస్థితి చెక్ చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

కేంద్ర ప్రభుత్వం వైద్య సిబ్బందికి టీకాలు వేయడానికి చేపట్టాల్సిన చర్యలపై మార్గ దర్శకాలను విడుదల చేసింది . జ్వరం ఉన్నపుడు టీకా వేసుకోవద్దు అని చెపుతున్నారు . జ్వరం పూర్తిగా తగ్గినా తరువాతే టీకా తీసుకోవాలనంటున్నారు నిపుణులు . మనకి అలర్జీ ఉంటె అది తగ్గినా తరువాతే టీకా తీసుకోవాలి . మొదటి టీకా తీసుకున్న తరువాతే ఏదయినా ఇబ్బంది అనిపిస్తే రెండో టీకా వేసుకోవద్దు అని తెలుపుతున్నారు .

నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు , నిరోధక శక్తి ఫై ప్రభావం పడే మందులు వాడే వారు , అవయవ మార్పిడి చేసుకున్నవారు , గర్భిణీలు టీకా తీసుకోక పోవడం మంచిది అంటున్నారు . ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కోవిద్ రోగులు కూడా ఈ వాక్సిన్ వేసుకోవద్దు అంటున్నారు . వాక్సిన్ లలో ఉండే సైడ్ ఎఫక్ట్ లగే కరోనా వాక్సిన్ లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి . వాక్సిన్ తీసుకున్నాక ఎలాంటి సమస్య కనిపించిన వైద్యులను కలిసి సూచనలు తీసుకోవాలి .

మన పేరుమీద ఫోన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో ఇలా తెలుసుకోండి