కల్వకుంట్ల కవిత : మొదలుపెట్టిన గ్రేటర్ ప్రచారం – Responsible

0
1139
కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో తెరాస పార్టీ తరుపున ప్రచారం మొదలు పెట్టింది . కార్ గుర్తుకు వోట్ వేసి తెరాస పార్టీని గెలిపించాలి అని గ్రేటర్ ప్రజలకు విన్నపం చేసింది .

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత గ్రేటర్ ప్రచారం

గ్రేటర్ ఎన్నికలు అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా చాల ముఖ్యంగా భావిస్తున్నాయి . బీజేపీ గ్రేటర్ లో పాగా వేయాలని ,కాంగ్రెస్ తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాయి . కవిత తన ట్విటర్ ద్వారా ఎన్నికల సందర్భంగా ప్రత్యేక వీడియో సందేశాన్ని ఇచ్చింది .
ఇప్పుడు హైదరాబాద్ ఎలావుందీ ,ఆరు సంవత్సరంల క్రితం ఎలావుందో హైదరాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ బిడ్డలందరికి తెలుసు అని అన్నారు . కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ఏంటో పురోగతి సాధించింది ,దానిని కోన సాగించాలి అంటే మల్లి జరగబోయే బల్దియా ఎన్నికలలో కార్ గుర్తుకు వోట్ వేయాలి అని తెరాస కవిత అన్నారు .

మహానగరంలో రోడ్లు ,24 గంటల కరెంటు, ఫ్లై ఓవర్లు , ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు నగరానికి రావడం సీఎం కేసీఆర్ ,తెరాస పార్టీ ద్వారానే సాధ్యం అయ్యాయి అని అన్నారు .
ఐదు యేండ్లు మన మహానగరం ఇండియాలో ఉంది ,దీనిని కొనసాగించాలి అంటే ఈ నాయకత్వాన్ని గెలిపించే బాధ్యత ప్రజలపై ఉంది . కేవలం పైపై మాటలతో ఇలాంటి ర్యాంక్ లు ,అవార్డులు ,అంతర్జాతీయ కంపెనీలు రావు , ఎంతో బాగా పని చేస్తే కానీ రావు అని కల్వకుంట్ల కవిత అన్నారు . అంత శ్రద్ద ,ప్రేమ ,ప్రణాళిక హైదరాబాద్ ఫై కేసీఆర్ కు ఉన్నాయి . అందుకే తెరాస అబ్యర్దులను గెలిపించి అభివృద్ధి కొనసాగించేలా చేయాలనీ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు .

Also Read

గ్రేటర్ ఎన్నికలు ప్రచారానికి ఈసీ రూల్స్- Rules