కాకులకు బర్డ్ ఫ్లూ .. రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్- Aware

0
1638
కాకులకు బర్డ్ ఫ్లూ సోకడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలు అలెర్ట్ గా ఉండాలని ప్రకటించింది . రాజస్థాన్ లో వందల సంఖ్యలో కాకులు చనిపోయాయి . దీనికి కారణం బర్డ్ ఫ్లూ అని కేంద్రం ప్రకటించింది . పక్షులు ఎక్కువగా మరణించే రాష్ట్రాలు అలెర్ట్ గా ఉండాలిని కేంద్రం సూచించింది . తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి .
కాకులకు బర్డ్ ఫ్లూ

కొన్ని వందల సంఖ్యలో కాకులు రాజస్థాన్ లో ఇప్పటికే చని పోయాయి . వీటి తో పటు కింగ్ ఫిషర్ కాకులు కూడా చని పోయినట్టు గుర్తించారు . ఝలావర్ లో 100, బరన్ లో 70, కోటాలో 40 కాకులు చనిపోయినట్టు అధికారులు తెలిపారు . కాకులు చనిపోయిన పరిసర ప్రాంతాలలో ఎవరికైనా ఫ్లూ లక్షణాలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు .
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోకూడా కాకులు చని పోయినట్టు గుర్తించారు . చనిపోయిన కాకులలో ఎచ్ 5ఎన్ 8 వైరస్ ఉన్నట్లు గుర్తించారు . అక్కడ ఫ్లూ లక్షణాలు ఉన్నవారి నుండి సాంపిల్స్ సేకరిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు . జ్వరం ,జలుబు , దగ్గు వంటి లక్షణాలు ఉంటే వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు . బర్డ్ ఫ్లూ కూడా చాల ప్రమాద కరమైంది అని చెపుతున్నారు . ఇది మనుషులకు కూడా సోకుతుంది అని అన్నారు . కాకులు వలస పక్షులు కాబట్టి అన్ని రాష్ట్రాలు అలెర్ట్ గా ఉండాలి అని తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పక్షులు మరణించే ప్రాంతాలలో నిషేధాలు విధించాయి .

సౌరబ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది వైద్యులు- Admit