కాణిపాకం వరసిద్ధి వినాయకుడు : సత్య ప్రమాణాలకు సాక్ష్యం – Miracle

0
1017

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఆలయం చిత్తూరు జిల్లా బహుదా నది ఒడ్డున ఉన్నది . ఈ వినాయకుడు సర్వ మతాల నుండి పూజలు అందుకుంటున్నాడు . ఇక్కడ స్వామివారికి హిందూవులేకాక అన్య మతస్థులు కూడా మొక్కులు తీర్చుకుంటారు . ఇంకో విశేషం ఏమిటి అంటే స్వామివారి దర్శనానికి ముస్లింలు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు . స్వామివారి బ్రమోత్సవాలు సర్వమత ఉత్సవాలుగా జరుగుతాయి .

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు

ఆలయ పురాణం

చారిత్రక ఆధారాలను బట్టి ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగినట్టు ఉంది . ధర్మ పరాయణులైన ముగ్గురు గుడ్డి,చెవిటి ,మూగ వాళ్లు విహారపురి అనే గ్రామంలో జన్మించారు . వాళ్లు పుట్టుకతో వచ్చిన కర్మఫలాన్ని అనుభవిస్తూ తమ దగ్గర ఉన్న పొలాన్ని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు . ఆలా జీవిస్తున్న క్రమంలో ఒకసారి కరువు కటకం ఏర్పడింది . కనీసం త్రాగడానికి మంచినీరు కూడా దొరకని పరిస్థితి . అప్పుడు ముగ్గురు కరువు నుండి బయట పడాలని సంకల్పించి తమ పొలంలో ఉన్న బావిని మరింత లోతుగా త్రవడం ప్రారంభించారు .

అలా త్రవుతుండగా మధ్యలో పెద్ద బండరాయి వచ్చింది . దాన్ని తొలగించే క్రమంలో పనిముట్లు బండరాయికి తగిలి రక్థము చిమ్మింది . ఆ చిమ్మిన రక్త వారిమీద పడి వారి అంగవైకల్యం పోయింది . విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావి దగ్గరికి వచ్చి పూర్తిగా త్రవ్వి చూడగా గణనాధుడి రూపం కనిపించింది . అప్పుడు గ్రామస్తులు భక్తి శ్రద్దలతో స్వామికి కొబ్బరికాయలు కొట్టి పూజించారు . కొబ్బరికాయలు కొట్టడంవలన వచ్చిన నీరు కాణి భూమి అంటే ఎకరం భూమి పారింది అందుకే ఆగ్రామానికి కాణి పారకం అనే పేరు వచ్చింది . కాలక్రమేణా అది కాణిపాకం గా పిలవడం జరిగింది .
కాణిపాకం వినాయకుడు సత్యానికి ప్రామాణికం గా కొలుస్తారు . కాణిపాకంలో ప్రమాణం చేసి మాట తప్పితే దేవుడు శిక్షిస్తాడు అనేది భక్త్తుల నమ్మకం . అందుకే అందరు ఆదేవుడిమీద ప్రమాణం చేయి అని అంటూవుంటారు .

దేవుడు పెరుగుతూ ఉంటాడు

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతూ ఉంటాడు దానికి ఆధారాలు ఉన్నాయని పండితులు అంటారు . 50 సంవత్సరాల క్రింద చేసినట్టు వంటి వెండి కవచం ఇప్పుడు స్వామివారికి సరిపోవటం లేదు . భక్తులు 2002 లో ఇచ్చిన వెండి కవచం సైతం సరిపోవడంలేదు . శివ – వైష్ణవ క్షేత్రంగా కాణిపాకం శోభిల్లితుంది . కాణిపాక ప్రధాన ఆలయం తోపాటు అక్కడ ఉన్న మిగితా ఆలయాలకు కుడా విశిష్ట ప్రాధాన్యం ఉంది . వినాయక ఆలయంతో పాటు మణికంటేశ్వర, వరదరాజులు , వీరాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి .

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు

రవాణా సౌకర్యం
ఈ ఆలయం తిరుపతి నుండి 75 కిలోమీటర్లు , చిత్తూర్ నుండి 12 కిలోమీటర్లు ఉంటుంది . కాణిపాకం వచ్చిన వారు తిరుపతి అలాగే శ్రీ కాళహస్తి కూడా వెళ్తూ ఉంటారు . ఇక్కడ బస చేసే భక్తులు చాల తక్కువ . దేవాలయం గదుల తో పాటు , టీటీడీ వసతి గృహాలు కూడా ఉంటాయి . చిత్తూర్ లో కూడా వసతి గృహాలు ఉంటాయి . తిరుపతి లో తీసుకోని కూడా ఇక్కడకు రావచ్చు . చిత్తూర్ నుండి తిరుపతి నుండి ఆర్టీసీ బస్సు లు ఉంటాయి .అలాగే ప్రైవేట్ వాహనాలు కూడా ఉంటాయి . రైల్ లేదా విమానాలలో తిరుపతి వరకు వెళ్లి అక్కడనుండి రోడ్ రవాణా ద్వారా వేళ్ళ వచ్చు .

Also Read

అద్భుతాలు జరిగే మన దేవాలయాలు మన దేశంలో ఇవే