కార్తీక దీపం డాక్టర్ బాబు ఇక ఇప్పట్లో కనిపించాడా ? No Good

0
1160
కార్తీక దీపం డాక్టర్ బాబు

కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రలో అందరి హృదయాలను చూరగొన్న నిరుపమ్ పరిటాల గురుంచి స్పెషల్ గా చెప్పాలిసింది ఏమిలేదు .
బుల్లి తెర శోభన్ బాబుగా పేరుతెచ్చుకున్నారు . కార్తీక దీపంలో మూడేళ్ళుగా డాక్టర్ బాబు పాత్రలో మంచి పేరు సంపాదించుకున్నారు .

కార్తీక దీపం డాక్టర్ బాబు
courtesy star maa/ hot star

కార్తీక దీపం డాక్టర్ బాబు

డాక్టర్ బాబుగా సీరియల్ లో అమ్మ పాత్ర అయినా సౌందర్యకి సమాధానం చెపుతున్న , హిమను ఓదారుస్తున్న , దీప మీద కోపం ప్రదర్శించిన ఆ పాత్రకి నటన ఒక వైపు అయితే , తన సొంత గొంతుతో దుబ్బింగ్ చెప్పడం కూడా జీవాన్ని పోసింది అని చెప్పుకోవచ్చు .

కొన్ని రోజులుగా చుస్తే డాక్టర్ బాబు గొంతు మారిపోయింది . వేరే వాళ్లతో దుబ్బింగ్ చూపిస్తున్నారు . నిరుపమ్ అలవాటు పడిన ప్రేక్షకులు వేరే వాయిస్ కి సరిగా కనెక్ట్ కాలేక పోతున్నారు . అతని సొంత గొంతులో కొంచెం రియాల్టీ గా , ఫన్ గా , కోపంగా ఏది చేసిన చాల బాగుండేది అని ప్రేక్షకులు అంటున్నారు .

కార్తీక దీపం ఒక్కటే కాదు నిరుపమ్ నటిస్తున్న ఇంకా రెండు సీరియల్స్ లో కూడా దుబ్బింగ్ చెపుతున్నారు . అతని వాయిస్ కి అలవాటు పడిన జనం వేరే వాయిస్ విని పించడం తో ఎంజాయ్ చేయలేక పోవుతున్నారు . ఆఫీసియల్ సోషల్ అకౌంట్లో కూడా అభిమానులు పోస్ట్ చేస్తున్నారు మీ వాయిస్ ఎందుకు చేంజ్ అయిందని .

హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ తో పాటు ఇంకా మిగిలిన ప్రాజెక్ట్ లో బిజీ గా ఉన్నారు అని , దుబ్బింగ్ చెప్పే టైం ఉండటం లేదని సీరియల్ ఇండస్ట్రీ టాక్ . నిరుపమ్ భార్య కూడా అదే చెపుతుంది .దుబ్బింగ్ చెప్పి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అని ,కొన్ని సార్లు తెలవారిపోతుంది అని చెప్పింది .

ఇంకో టాక్ కొన్ని రోజులు డాక్టర్ బాబు పాత్ర కనపడకపోవచ్చు అని , అందుకే వెతికే పాత్రలాగా క్రియేట్ చేసారని , ఇయర్ ఎండింగ్ లోపు సీరియల్ ముగించేస్తారు అని అందుకే ముగిపు దిశగా సీరియల్ వెళ్తుంది అని టాక్ . ఏది ఎంత వరకు నిజమో కానీ డాక్టర్ బాబు పాత్రా ప్రేక్షకులకు చాలా అలవాటు అయిపొయింది . డాక్టర్ బాబు లేకుండా సీరియల్ ఎలాఉంటుందో చూడాలి .

Also Read

నాగబాబు కూతురు పెళ్లి : చైతన్యతో డిసెంబర్ 9న …ఎక్కడంటే – Happy