కార్తీక మాసం 2020 విశిష్టత చేయవలసిన పూజలు- Special

0
3676
కార్తీక మాసం 2020

కార్తీక మాసం 2020 దీపావళి అయిన మరుసటిరోజు అంటే నవంబర్ 16 నుండి మొదలు అయినది .పూర్ణ చంద్రడు కృతిక నక్షత్రం లో కలిసిన రోజు కార్తీకం . అందుకే ఈమాసాన్ని కార్తీక మాసం అంటారు . తెలుగు సంవత్సరంలలో ఎనిమిదో నెల వస్తుంది ఈ మాసం .

కార్తీక మాసం 2020

కార్తీక మాసం 2020 విశిష్టత

మన పెద్దలు కార్తీక మాసం శివ ,కేశవులకు అత్యంత ఇష్టమైన మాసంగా పేర్కొంటారు . శివుడిలో విష్ణువు , విష్ణువులో శివుడు ఉంటాడని వేదాలు చెబుతున్నాయి . శివ పూజకు , విష్ణు పూజలకు కార్తీక మాసం చాల పవిత్రమైనది . భక్తుల ఈ మాసాన్ని అత్యంత మహి మానిత్వమైన మాసం గా భావిస్తారు . ఈ మాసంలోపూజలు ,వ్రతాలు ,నోములు భక్తి శ్రద్ధలతో చేస్తారు .
కృత యుగం , వేదాలు , గంగా నదికి ఎలాంటి ప్రాధాన్యత ఉందొ కార్తీక మాసానికి అలంటి విశేషమే ఉందని మన పెద్దలు చెప్పారు . కార్తీక మాసంలో శివ కేశవులకు చేసే నోములు , వ్రతాలు ,పూజల వలన జన్మంతరాలనుండి ఉండే పాపాలు తొలిగి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి .

కార్తీక మాసం మొత్తం శైవ క్షేత్రాలు శివ జపాలతో హోరెత్తు తాయి . పార్వతి పరమేశ్వరుల కటాక్షానికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు .
శివుడికి అలంకరణలతో పనిలేదు .ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు . భక్తితో శివుడిని అభిషేకిస్తే చాలు ప్రసన్నుడు అయిపోతాడు . అభిషేకం చేయడం వలన ఎన్నో దోశాలూ తొలగి పోతాయి . శివార్చన చేయడం వలన అన్ని బాధలు, గ్రహల దోశాలు తొలగిపోతాయి .

ఈమాసంలో బిల్వ పత్రంతో శివుడిని పూజిస్తే కొన్ని వేళ సంవత్సరాలు స్వర్గంలో జీవించవచ్చు అంటారు . ప్రదోష కాలం అంటే శివ పార్వతుల అర్ధనారీశ్వరుల దర్శనమిచ్చే సమయంలో శివారాధన చేసిన , శివ దర్శనం చేసిన శివానుగ్రహం పొందుతాము . ఈ మాసంలో లింగార్చన ,మహా లింగార్చన , సహస్ర లింగార్చన ప్రాముఖ్య మైనవి .

ఈ మాసం శివ అనుగ్రహానికి ,విష్ణు అనుగ్రహానికి అనువైనది . ఈ కార్తీక మాసంలో విష్ణువుని తులసి దళం తో పూజిస్తే ముక్తి కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి . విష్ణు సహస్త్ర పారాయణం , సత్యనారాయణ స్వామి వ్రతం , రుద్రాభిషేకం చేయడం వలన మనకు చాల మంచి ఫలితాలు వస్తాయి . ఈ మాసంలో ఏ మంత్రం దీక్ష చేసిన కూడా మంచి ఫలితం వస్తుంది .

కార్తీక పురాణం ఈ మాసంలో అధ్యనం చేసుకోవచ్చు . మొదటి 15 అధ్యాయాలు శివుని విశిష్టత తెలుపుతే , తరువాత అధ్యాయాలు విష్ణువు మహత్యాన్ని తెలుపుతుంది . కార్తీక మాసంలో ఆకాశ దీపం కూడా చాలా ప్రాముఖ్యమైనది . ఆలయాలలో దీపారాధన చేసిన , అలాగే ఇంటి పూజ మందిరంలో , తులసి కోట వద్ద దీపారాధన చేసినా ఇహ ,పరలోక సౌఖ్యములు లభించును .ఈ మాసంలో దీప దానానికి కూడా ప్రత్యేకత ఉంది . దీపం ఒక్కసారి దానం చేసిన సంవత్సరం మొత్తం చేసిన ఫలితం వస్తుంది .

ఆదిత్య హృదయం పరాయణమ్ చేయటం వల్ల ఆయురారోగ్యాలు లభిస్తాయి . గోవుని పూజించి ,సవించడం వల్ల వంశ వృద్ధి జరుగుతుంది . తులసిపూజ కల్యాణానికి ప్రతిదీ . ఈమాసంలో సత్య నారాయణ వ్రతం చేయడం వలన మన అన్ని కోరికలు తీరుతాయి . అది కార్తీక పౌర్ణమి రోజు వ్రతం చేస్తే ఇంకా చాలామంచిది . అందుకే మన పెద్దల కాలం నుండి ఇప్పటి వరకు భక్తులు కార్తీక మాసాన్ని డైవ మాసం గా భావించి పూజలు ,దాన ధర్మాలు చేస్తారు .

Also Read

మ్యాగీ పిజ్జా : ఇంట్లోనే చాల సింపుల్ గా చేయచ్చు- Delicious