కూతురు డిఎస్పీ తండ్రి సీఐ అవడంతో పోలీసు నాన్న పోలీసు కూతురికి గర్వముగా సెల్యూట్ చేయడం చాల అరుదుగా జరుగుతుంది . డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారి కి సెల్యూట్ చెయ్యడం కామన్ . కానీ ఆ ఉన్నతాధికారి తన కూతురు అయితే , ఆ తండ్రి చేసే సెల్యూట్ లో ప్రేమ , ఆనందం , గర్వం కలగలిపి ఆ పోలీసు అధికారి సెల్యూట్ లో కనిపించింది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021 ఏపీ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతి లో నిర్వహిస్తున్నారు . దానికి క “ఇగ్నైట్” అని పేరు పెట్టారు. కూతురికి తండ్రి సెల్యూట్ చేసే అరుదయిన ఘటన “ఇగ్నైట్” వేదికయ్యింది.
జెస్సీ ప్రశాంతి( 2018 బ్యాచ్) గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో “దిశ” విభాగం లో జెస్సీ ప్రశాంతి ,తిరుపతి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్ ఇంస్పెక్టర్ గా శ్యామ్ సుందర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటీలో ఉన్న తన కూతురిని చూస్తూ శ్యామ్ అనాధపడిపోయారు . తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండడం గర్వముగా ఫీల్ అయ్యాడు . కూతురు దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు. కూతురు సెల్యూట్ చేసి ఏంటి నాన్నా అంటూ నవ్వేశారు.పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరొకటి ఉండదు. తన బిడ్డ నీతి నిజాయతీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని శ్యామ్ సుందర్ అన్నారు. పోలీస్ తండ్రి పోలీస్ కూతురిని చూసి తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి స్పందిస్తూ “ఇలాంటి సన్నివేశం సహజంగా నినిమాలో చూస్తుంటాం. తిరుపతి డ్యూటీ మీట్ లో కూతురు డిఎస్పీ తండ్రి సీఐ ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యడం నాకు వ్యక్తిగతం గా చాలా గర్వంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రశాంతి” అని అభినందించారు.