కేటీఆర్ జీహెచ్ఎంసి 2020: పొలిటికల్ టూరిస్టులతో హైదరాబాద్ కు లాభం లేదు

0
976
కేటీఆర్ జీహెచ్ఎంసి ఎన్నికలలో భాగంగా మాట్లాడుతూ పొలిటికల్ టూరిస్టులతో హైదరాబాద్ ఏమి . హైదరాబాద్ లో ఎన్నికలు అనగానే హడావిడిగా వస్తున్న ఢిల్లీ బీజేపీ నాయకులు ఈ ఆరేళ్ల కాలంలో హైదరాబాద్ నగరానికి ఏంచేశారో చెప్పాలని కేటీఆర్అన్నారు .
కేటీఆర్ జీహెచ్ఎంసి

జీహెచ్ఎంసి 2020 ఎన్నికల సందర్భంగా రోడ్ షో లో కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల కురిన వర్షాలకు హైదరాబాద్ నగర ప్రజలు అల్లాడుతుంటే కనీసం ఏంజరిగింది అని ఇటు వైపు చూసే సాహసం కూడా బీజేపీ నాయకులు చేయలేదన్నారు. ఇప్పుడు గుంపులు గుంపులుగా నగరానికి వచ్చిన నాయకులు వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నారన్నారు. వాళ్ళ ప్రభుత్వాలకి గుజరాత్ లో వరదలు వస్తే 500 కోట్లు, బెంగుళూరులో వరదలు వస్తే 669 కోట్లు వెంటనే వరదసాయం ప్రకటించిన మోడీ మన తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే 1350 కోట్ల సాయం అందించమని ఉత్తరం రాస్తే కూడా స్పందించకుండా దున్నపోతు మీద వానపడ్డట్లు ఉన్నారు ఆంరు .

హైదరాబాద్ నగరానికి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న కేంద్ర మంత్రులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేసిన 1350 కోట్లు కూడా వెంట తీసుకొని రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జన ధన్ ఖాతాలు ప్రజలు ఓపెన్ చేస్తే ప్రతీ ఒక్కరి అకౌంట్లో వెంటనే 15 లక్షలు వేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు. అమిత్ షా వద్ద ఒక విలేఖరి ఇదే ప్రస్తావన తీసుకు వస్తే అది అంతే అని కొట్టిపారేశారు. జనం చెవిలో పువ్వు పెట్టినం అని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలకు వీళ్ళు ప్రకటించిన వరద సాయం 25 వేలు కూడా ఎన్నికల తరువాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల జిమ్మిక్కుగా కొట్టిపారేస్తాడన్నారు.

మోడీ సర్కార్ తెలంగాణ విషయంలో చేసింది సున్నా అని అమిత్ షా చెప్పినట్లు కేంద్రం నుండి తెలంగాణ కు లక్ష కోట్లు ఇచ్చామని చెప్తున్నా మాట అసంబద్దమైనదిగా చెప్పారు. అసలు లెక్కలోకి వెళితే తెలంగాణ ద్వారా వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లిన సొమ్ము అక్షరాలా 2 లక్షల 72 వేల కోట్లన్నారు. తిరిగి తెలంగాణ ప్రజలకు కేవలం సగం మాత్రమే వస్తున్నాయన్నారు.

ఢిల్లీ లోని బీజేపీ సర్కార్ హైదరాబాద్ కోసం చేసిన కనీసం ఒక పనిని అయినా చూపెట్టి ప్రజలను ఓట్లు అడగాలి అని కిషన్ రెడ్డి ని కేటీఆర్ నిలదీశారు. అంతేకాదు, అమిత్ షా చెప్పినట్లు మనకు ఇచ్చిందేమి లేదన్నారు. ఇంకా మాట్లాడాలంటే బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రోడ్లు ఇతర అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్న సొమ్ములో తెలంగాణ ప్రజల చెమట ఉందన్నారు.గల్లీ పార్టీ కావాలో ఢిల్లీ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కేటీఆర్ గారు అన్నారు. గత ఆరేళ్లలో నగర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూడాలన్నారు.

Also Read

నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఫెస్ట్ ఉచితంగా ప్రేక్షకులు డిసెంబర్ 5,6 తేదీలలో