కేటీఆర్ VS రేవంత్ రెడ్డి : వైరల్ అవుతున్న ఇద్దరి(2) మధ్య వార్- Fight

0
564
కేటీఆర్ VS రేవంత్ రెడ్డి : ఇప్పుడు ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తెలంగాణాలో హాట్ హాట్ గా నడుస్తుంది . ముందు నుండి తెరాస పార్టీపై కానీ ఆ నాయకులపై కానీ మాటలు ఎక్కు పెడుతున్న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత ఇంకా పదునైన మాటలతో విమర్శనాస్త్రాలు సందిస్తున్నాడు . ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది చూద్దాం .
కేటీఆర్ VS రేవంత్ రెడ్డి

డ్రగ్స్‌ లింకుల సంబంధించి ట్వీట్ లతో ఇద్దరి మధ్య వార్ మొదలయింది . రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు నేను వైట్‌ ఛాలెంజ్‌ప్రారంభిస్తున్నాను అని రేవంత్‌ రెడ్డి ప్రకటించాడు . ఈ ఛాలెంజ్ కోసం తాను డ్రగ్స్‌ పరీక్షల కోసం తన రక్తం, వెంట్రుకల నమూనాలను ఇస్తానని అనడమే కాకుండా మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఛాలెంజ్‌ విసురుతున్నానని అన్నారు . వాళ్లిద్దరూ ఛాలెంజ్‌ను స్వీకరించి మరో ఇద్దరికి ఛాలెంజ్‌ చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు .

డ్రగ్స్‌ పరీక్షల కోసం ఏ ఆసుపత్రికి రామన్న వస్తానని వైద్యులకు నమూనాలు ఇద్దామని అన్నాడు . ఓ మంత్రిగా ఎందుకు జోక్యం చేసుకోవటంలేదు ,డ్రగ్స్‌ కేసుపై మంత్రి ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి వైట్‌ ఛాలెంజ్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సిద్ధమా, రాహుల్‌ ఒప్పుకొంటే ఢిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధమని ట్వీట్ చేసారు కేటీఆర్ . చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారి స్థాయి కాదు నాది, పరీక్షల్లో క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుతావా , ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్దమేనా ? అంటూ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కేటీఆర్

కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై రేవంత్‌ స్పందిస్తూ సీఎం కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమని దీనికి సమయం, స్థలం చెప్పండి . సీబీఐ కేసులు, సహారా పీఎఫ్‌ అక్రమాలు, ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణంలో అక్రమాలపై లైడిటెక్టర్‌ పరీక్షలకు కేసీఆర్‌ సిద్దమేనా ? అంటూ ప్రతిసవాల్ ట్వీట్ చేసాడు రేవంత్ .తనపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తుండడంతో చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయించినట్లు ,పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు,క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్టు మంత్రిచెప్పారు .

ఈ విషయమై రియాక్ట్‌ అయిన పీసీసీ చీఫ్ కోర్టులలో కేసుతో ఎవరిని బెదిరిస్తున్నారని ప్రశ్నించారు.డ్రగ్స్ పరీక్షలతో సమాజానికి ఆదర్శంగా ఉండమని సూచిస్తే కోర్టులో కేసు పెడతారా ? అని వ్యాఖ్యానించారు.కొండా విశ్వేశ్వరరెడ్డి తన ఛాలెంజ్ స్వీకరించారని ,కేటీఆర్ స్వీకరించకపోగా ఇలా చేస్తున్నారు విమర్శించారు.ఏది ఏమైనా కేటీఆర్ VS రేవంత్ రెడ్డి ట్వీట్ వార్ ప్రజలలో ఆసక్తి నెలకొంది .

రేవంత్ రెడ్డి vs ఎంపి కోమటిరెడ్డి : ఫ్రెండ్స్ మధ్య దూరం ఇప్పట్లో తగ్గదా ? Competitive