కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎందుకు వెళ్ళాడు …. 8 రోజులు ఉండి ఏమిచేసారు ? Secret

0
758
కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎందుకు వెళ్ళాడు అందులోను ఎనిమిది రోజులు ఢిల్లీ లో ఉంది ఏంచేశారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది . ఎందుకంటె ముఖ్యమంత్రి ఢిల్లీలో పెద్దగా కార్యక్రమంలో పాల్గొన్నది ఏమిలేదు . ప్రధాని ,అమిత్ షా ఇంకో మంత్రిని మాత్రమే కలిశారు . ఉన్నన్ని రోజులు తన నివాసంలోనే ఉన్నారు . మీడియా కి కూడా దూరంగా ఉన్నారు . కేసీఆర్ అన్ని రోజులు రాజధానిలో ఏంచేశారు .. దాని వెనుక ఏమైనా విషయం ఉండ అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆలోచన ?
కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎందుకు

తెలంగాణ ముఖ్యమంత్రి 8 రోజుల ఢిల్లీ టూర్ ముగించారు . అయితే ఇన్ని రోజులలో ముఖ్యమంత్రి పాల్గొన్నది ఎక్కువ కార్యక్రమాలు ఏమీలేవు . 2 న టీఆరఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసారు . 3వ తారీఖున ప్రధాని మోడీ ని కలిశారు . 4వ తారీకు హోమ్ మినిస్టర్ అమిత్ షా ని కలిశారు . 6న కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి ని, జలశక్తి మంత్రిని కలిశారు . ఇంకా మిగితా రోజులలో కేసీఆర్ ఏమిచేశారనేది కూడా ఎవరు చెప్పలేక పోతున్నారు . ముఖ్యమంత్రి ఏ ప్రణాళికతో వెళ్ళాడో కానీ మొత్తానికి 8 రోజులు రాజధానిలోనే మకాం పెట్టాడు .
ఆయన బయలుదేరే వరకు తిరిగి రాష్ట్రానికి ఎప్పుడు వెళతారన్నది ఎ

రెండు మూడు రోజులకే పరిమితం అవుతుంది అనుకున్న కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఇన్ని రోజులు ఉండేసరికి రాజకీయం గా కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎందుకు, ఏదో మతలబు ఉందనేది రాజకీయ వర్గాల ఆలోచన . కేసీఆర్ తో వెళ్లిన అధికారులు రెండురోజులకే తిరిగి రావడం ముఖ్యమంత్రి మాత్రం అక్కడే ఉండడం కూడా రాజకీయ అనుమానాలకు తెరలిపింది . రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కూడా కలుసుకుంటారని అనుకున్నారు కానీ అపాయింట్‌మెంట్ దొరకలేదని సమాచారం .

ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా కేసీఆర్‌ అడిగిన వెంటనే కలవడం కాకుండా ఎంతో గౌరవంతో వ్యవహరించడం రాజకీ య వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది . శంకుస్థాపన పేరుతొ రాజధానికి వెళ్లిన వ్యూహంతోనే వెళ్లినట్లు సమాచారం . రాష్ట్రంలో బిజెపి ప్రత్యర్థిగా ఎదుగుతున్న కేంద్రంతో మాత్రం మిత్ర పక్షమే అనే భావన కలిగే విధంగా కేసీఆర్ వ్యవహారం కనిపిస్తుందనేది విశ్లేషకుల భావన . మోడీ కూడా కేసీఆర్ లాంటి వారిని వదులుకోరనేది వినిపిస్తున్న టాక్ . సీనియర్ పార్టీలకె రాజధానిలో భవనములు లేవు . అలాంటిది కేంద్రం తో సంబందాలు లేకపోతె టీఆరఎస్ పార్టీకి స్థలం ఎల్ ఇస్తారు అనేది రాజకీయ ప్రత్యర్థుల వాదన . కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టె పధకాలు పొడగడం కొసమెరుపు . కేసీఆర్ ప్రభుత్వం క్కూడా మోడీ ప్రభుత్వ అన్ని నిర్ణయాలకు మద్దత్తు ఇస్తూనే ఉన్నారు . మోడీని కలిసిన తరువాతే హుజురాబాద్ ఎన్నిక వాయిదా పడిందనేది రాజకీయ వర్గాల ఆరోపణ .

ఏపి కేబినెట్ డెడ్ లైన్ : రెండున్నరేళ్లు పూర్తవుతుండడంతో మంత్రులలో గుబులు- Tense