కేసీఆర్ హామీతో జీహెచ్ఎంసీ వాసులకు 20వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకం ప్రారంభం- Launch

0
1136
కేసీఆర్ హామీతో జీహెచ్ఎంసీ లో20వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకం ప్రారంభం జనవరి 12 న ప్రారంభమయింది . ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ. క‌ల్వకుంట్ల చంద్ర శేఖ‌ర్ రావు ఇచ్చిన హామీ మేరకు… హైదరాబాద్ వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా అందించేందుకు పధకం మొదలయింది . ఈ పథకం వ‌ల్ల నగరంలో నివసిస్తున్న సుమారు 97% పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. ముఖ్యoగా, మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాది మందికి ఈ పథకం ఎంతో మేలు చేకూరుస్తుంది అని ప్రభుత్వం తెలిపింది .
కేసీఆర్ హామీ జీహెచ్ఎంసీ

12 జనవరి 2021, మంగ‌ళ‌వారం రోజున ప్రారంభం మయినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా అంటే, జ‌న‌వ‌రిలో జారీ చేసే డిసెంబ‌ర్ బిల్లు నుంచే ఈ ఉచిత పథ‌కం అమ‌ల్లోకి వస్తుంది.‌ అన‌గా, డిసెంబ‌ర్ 2020 మాసానికి సంబంధించి 20 వేల లీటర్ల వ‌ర‌కు నీటిని వాడుకున్నవారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, 20 వేల లీట‌ర్ల పైన‌ నీటిని వినియోగించిన‌ వారు మాత్రం ఆ మేర‌కు నల్లా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉచిత‌ తాగునీటి సౌక‌ర్యాన్ని వినియోగ‌దారులు పొందాలంటే.. వారు త‌మ క‌నెక్‌సన్ల‌కు త‌ప్ప‌నిస‌రిగా మీట‌ర్లు ఏర్పాటు చేసుకోవాల్సిందే. అయితే స్ల‌మ్ ల‌ల్లో నివ‌సించే వారికి ఎలాంటి మీట‌రు అమ‌ర్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇలాంటి పథకం మనదేశం లో ఇప్పటికే ఢిల్లీ లో అమలవుతుండగా… తరువాతి స్థానంలో మన రాష్ట్రం నిలుస్తుంది. దీనికి సంబందించిన మార్గదర్శకాలను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, మెమో.నెం. 13423/Engg.2/2020, తేదీ: 08.01.2021 ద్వారా జారీ చేశారు.

కేసీఆర్ హామీతో జీహెచ్ఎంసీ వాసులకు ఈ ప‌థ‌కాన్ని రాష్ట్ర పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మాత్యులు శ్రీ. క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు గారు క్షేత్ర స్థాయిలో ప్ర‌జాప్ర‌తినిధుల స‌మ‌క్షంలో ఎస్పీఆర్ హిల్స్, రెహ‌మ‌త్ న‌గ‌ర్, బోరబండలో తేదీ: 12 జ‌న‌వ‌రి 2021, మంగ‌ళ‌వారం రోజున‌ లాంఛ‌నంగా ప్రారంభించారు .

దీనికి సంబంధిచిన మార్గ ద‌ర్శ‌కాలు

డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు :
డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులకు జీరో బిల్ జారీ చేస్తారు. వీరికి స్లమ్ డాకెట్వారీగా నీటి వాడకాన్ని లెక్కిస్తారు. వీరు తమ నల్లా కనెక్షన్లకు వాటర్ మీటర్ల ను బిగించుకోవాల్సిన అవసరం లేదు.

డొమెస్టిక్ వినియోగదారులు :
డొమెస్టిక్ వినియోగదారులకు అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అయితే వీరు తమ సొంత ఖర్చుతో జలమండలి సూచించిన ఏజెన్సీల ద్వారా వాటర్ మీటర్ల ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఏజెన్సీల వివరాలు జలమండలి వెబ్ సైట్ లో పొందుపరిచారు. వీరికి నెలకు 20 వేల లోపు వినియోగించిన నీటికి ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 20 వేల లీటర్ల పైన నీటి వాడకానికి మీటర్ రీడింగ్ ప్రకారం బోర్డు టారిఫ్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

డొమెస్టిక్ అపార్ట్మెంట్లు :
వీరు కూడా తమ సొంత ఖర్చుతో మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అపార్ట్మెంట్ లలో నివసించే వారికి ఒక ఫ్లాటుకి లేదా గృహానికి 20 వేల లీటర్ల చొప్పున ఉచితం. అంతకుమించి వాడితే.. బోర్డు టారిఫ్ ప్రకారం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వీరు కూడా బోర్డు సూచించిన ఏజెన్సీల ద్వారా వాటర్ మీటర్లను బిగించుకోవాలి.

ఆధార్ లింక్ :
ఈ పథకానికి అర్హులైన వినియోగదారులందరూ.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ జారీ చేసిన జీవో Ms.NO.211 తేదీ: 02.12.2020 ప్రకారం తమ క్యాన్ (CAN ) నెంబర్ల కు తమ ఆధార్ కార్డు ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంత మీ సేవ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.
వినియోగదారులందరికీ మార్చి 31 తేదీ వరకు మీటర్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ సమయంలోపు మీటర్ల ఏర్పాటు మరియు ఆధార్ కార్డు లింక్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరికీ ఏప్రిల్ మొదటి తేదీ నుండి డిసెంబర్ నెల నుండే ఈ పథకం వర్తించే విధంగా బిల్లులు జారీ చేయబడతాయి.
ఈ పథకం క్షేత్ర స్థాయిలో అమలుకు జలమండలి కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ (CRM ) కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.

ల‌బ్దిదారుల వివ‌రాలు
కేట‌గిరి లబ్ది పొందే క‌నెక్ష‌న్ల సంఖ్య‌ మీట‌ర్ క‌నెక్ష‌న్లు ల‌బ్ది దారులకు
ఆదా అయ్యే రెవెన్యూ (నెల‌కు)
డొమెస్టిక్ స్ల‌మ్ వినియోగ‌దారులు 1.96 ల‌క్ష‌లు మీట‌రు ఏర్పాటు అవ‌స‌రం లేదు. రూ. 4.78 కోట్లు
డొమెస్టిక్ వినియోగ‌దారులు 7.87 ల‌క్ష‌లు 2.20 ల‌క్ష‌లు రూ. 6.91 కోట్లు
డొమెస్టిక్ అపార్ట్మెంట్లు & డొమెస్టిక్ బ‌ల్క్ 24,967 17,192 రూ. 8.23 కోట్లు
10.08 ల‌క్ష‌లు 2.37 ల‌క్ష‌లు రూ. 19.92 కోట్లు

  1. ఈ ప‌థ‌కం కేవ‌లం పైన పేర్కొన్న డొమెస్టిక్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తాయి. మిగ‌తా కేట‌గిరి వారు బోర్డు టారిఫ్ ప్ర‌కారం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
  2. వినియోగ‌దారులు త‌మ క్యాన్ నెంబ‌ర్ల‌తో ఆధార్ ను లింక్ చేసుకోవ‌డానికి www.hyderabadwater.gov.in వెబ్ సైట్ ను సంప్ర‌దించ‌గ‌ల‌రు లేదా మీ ద‌గ్గ‌ర్లోని మీ సేవ సెంట‌ర్ లో ఆధార్ కార్డును క్యాన్ నెంబ‌ర్ కు లింక్ చేసుకోవ‌చ్చు.
  3. వినియోగ‌దారులు త‌మ క‌నెక్ష‌న్ల‌కు మీట‌రు ఏర్పాటు చేసుకోవ‌డానికి తుది గడువు 31 మార్చి 2021.
  4. వినియోగ‌దారులు త‌మ సందేహాల‌ను క‌న్స్యూమ‌ర్ రిలేష‌న్ షిప్ మేనేజ్ మెంట్ ను సంప్ర‌దించి గానీ, లేదా క‌ష్ట‌మ‌ర్ కేర్ నెంబ‌ర్ 155313, Ph: 040-2343 3933 కు గానీ ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

కరోనా వాక్సినేషన్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు- Rules