క్రికెట్ ఇంగ్లండ్ లో మొదలయింది . మొదట్లో టెస్ట్ మ్యాచ్‌లే ఉండేవి . కానీ రానురాను క్రికెట్ లో చాల మార్పులు జరిగాయి . టెస్ట్ మ్యాచ్ నుండి వన్ డే మ్యాచ్‌లు , డే నైట్ మ్యాచ్ లు ,తరువాత 20/20 మ్యాచ్ లు . అసలు టెస్ట్ మ్యాచ్ లనుండి వన్ డే మ్యాచ్ ఆడాలనే ఆలోచన ఎలా వచ్చిందో చూద్దాం .
మొదట్లో మ్యాచ్ చాల రోజులు అంటే తేదీలు ఫిక్స్ లేకుండా అందరూ అవుటయేదాకా జరిగేవి . తరువాత దానిని ఐదు రోజులకు ఫిక్స్ చేసారు .
ఇంగ్లాండ్ ,ఆస్ట్రేలియా ల మధ్య 1971 లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది . వర్షం కారణంగా మూడు రోజులు మ్యాచ్ జరగలేదు . ఒక్కరోజులో అట ముగించాలని నిర్ణయించారు . 40 ఓవర్ ల మ్యాచ్ ఆడించాలి అని అనుకున్నారు . ఓవర్ కి ఎనిమిది బంతుల చొప్పున నిర్ణయించారు .
ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది . ఇది బాగానే ఉందని అపుడు అప్పుడు ఇలా మ్యాచ్ లు పెట్టె వారు . మొదటిసారి 1975 లో పరిమిత ఓవర్ ల ఫార్మాట్ లో వరల్డ్ కప్ నిర్వ హించారు .
కెర్రీ ప్యాకర్ ఆస్ట్రేలియా వ్యాపార వేత్త కి ఈ ఫార్మేట్ నచ్చింది . దీనితో తన టెలివిషన్ నెట్ వర్క్ కోసం వరల్డ్ సిరీస్ మొదలుపెట్టాడు . 1983 వరకు 60 ఓవర్ ల మ్యాచ్ లు ఉండేవి తరువాత 50 ఓవర్ ల మ్యాచ్ లు మొదలు పెట్టారు.