గంగవ్వ బిగ్ బాస్ లో నేను ఉండలేకపోతున్నా ,నన్ను ఇంటికి పంపించు అని కంటతడి పెట్టి బిగ్ బాస్ ని కోరింది . నాకు ఆరోగ్యం సహకరించటం లేదు . నాకు తల్లి లేదు తండ్రి లేడు బిగ్ బాస్ నువ్వు మంచిగా చూసుకుంటున్నావ్ . నాకూడా ఒకటి రెండు నెలలు ఉండాలని బాగా ఉండే . నాకు ఒళ్ళంతా బాగా నొస్తున్నాయి . అప్పుడు నా మొగుడు కొట్టిన దెబ్బలు రెస్ట్ లేక నొప్పిలేస్తున్నాయి .

నేను ఇండ్లకు వచ్చేటప్పుడు మొక్కుకొని వచ్చిన మంచిగా ఉందామని కానీ నాకు అయితలేదు బాంచన్ . మీరు నన్ను ఒక తల్లి లాగ ,తండ్రిలాగా చూస్తున్నారు కాని ఇక్కడ నాకు పడతలేదు . నాకు చిన్న పిల్లలు లేరు ,నేను చూసుకునే వాళ్ళు లేరు ,అందరూ పెద్దవాళ్ళు అయినారు . ఇక్కడ ఉండమని వచ్చిన కానీ ఉండలేకపోతున్నా అని ఏడుస్తూ బిగ్ బాస్ కి పంపించమని వేడుకుంది . బిగ్ బాస్ గంగవ్వతో మీరు దేర్యంగా వుండండి , డాక్టర్లు మీఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని తొందర్లోనే మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది . గంగవ్వ మీరు అన్నారు గట్టి దానినే కాని ఇక్కడ నాకు పడతలేదు మీరు ఎమన్నా అనుకోండి అని బిగ్ బాస్ తో చెప్పింది .