గంగ అవ్వ bigg boss 4 లో తన జీవిత గురుంచి చెప్పటంతో అందరికి ఆమె చాల ఆదర్శం గ నిలిచారు .

జీవితంలో అందరు అనుకున్నదే పనిగా వెంటనే విజయం సాధించాలి అనుకుంటారు . అనుకున్నది జరగక పొతే నిరాశ నిస్పృహలకు లోనవుతారు . అన్ని జన్మలోకెల్లా మనవ జన్మ చాల గొప్పది .దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోలేకపోతున్నారు . మన జీవితాన్ని మనం ఎంచుకున్న మార్గంలో నడుపుకుంటూ వెళ్ళాలి . ఇప్పుడా అప్పుడే ఇప్పుడా అనేది మనం చెప్పలేం కానీ విజయం మాత్రం ఖశ్చితంగా వస్తుంది అనేది కొంత మంది జీవితం చుస్తే అర్ధ మవుతుంది . అలంటి వాళ్లలో గంగ అవ్వ ఒకరు . అవును రోజు ఒక పూట తినటానికి కష్టపడే గంగ అవ్వ ఈ రోజు తన ఇల్లు కట్టుకోవాలనే కల నెరవేర్చే స్టేజి లో వుంది . ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగింది , కథ ఏంటో తెలుసుకుందాం .
పవన్ కళ్యాణ్ ఫై కోపంతో కాదు బాధతో రాసాను ఈ లేఖ-మాధవీలత
తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడాపల్లి గ్రామం . తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు .తల్లి 13 యేండ్ల వయసులో అనారోగ్యంతో చనిపోయింది . గంగ అవ్వ చిన్నతనంలోనే పెళ్లిచేసుకుంది . భర్త తాగుబోతు . తాగి భర్త గొడవ చేయని రోజులేదు .గంగవ్వకు ముగ్గురు పిల్లలు . ఉదయంపూట కూలిపనులు వెళ్ళేది . డబ్బులు చాలడం లేదని రాత్రి పూట బీడీలు చుట్టేది . భర్త డబ్బులు సంపాదిస్తాని దుబాయ్ వెళ్ళాడు . కానీ ఏనాడూ ఒక్క పైసా పంపలేదు . పిల్లల బాధ్యత తానే తీసుకుంది . కొన్నిరోజుల తరువాత భర్త దుబాయిలోనే చనిపోయాడని తెలిసింది గంగ అవ్వకి . తన చిన్నా కూతురికి 8 యేండ్ల వయసులో జ్వరం వచ్చి పిట్స్ వచ్చాయి . అప్పుడు భర్త దుబాయిలో ఉండడంతో బిడ్డని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది . హాస్పిటల్ వాళ్ళు ఏంజరిగిందో చెప్పకుండా కూతురిని తీసుకెళ్లామని చెప్పారు .
డబ్బులు లేక కూతురుని భుజాలపై మోసుకొని ఇంటికి తీసుకెళ్లింది . కూతురు చనిపోయిందని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చింది . పొలంలో కూలి పని చేసే గంగవ్వ కు my village show అనే యూట్యూబ్ ఛానెల్ తో ప్రపంచానికి పరిచయమైంది . తన సహజ మాటలతో , స్వచ్ఛమైన మనసుతో టీవీ స్టార్ ,సినిమా స్టార్ లకు లేని అభిమానులను సంపాదించుకుంది . టీవీ ప్రోగ్రాంలకేగాని ,సినిమా ప్రమోషన్ లకేగాని గెస్ట్ గ పిలుస్తున్నారు అనుకుంటే ఆమె రేంజ్ ఏంటో ఇప్పుడు మనం అర్ధం చేసుకోవచ్చు . ఇప్పుడు బిగ్ బాస్ Four తెలుగు లో ఆ ప్రోగ్రామ్ గంగ అవ్వ నే రేటింగ్ స్టార్ అని ఎవ్వరైనా చెప్పుతారు .అందుకే మనకి ఎప్పుడు ఏవిధంగా ఉంటుందో చెప్పలేము . మనం మన జీవిత మార్గంలో ప్రయత్నాలు చేసుకుంటూనే వెళ్ళాలి . విజయం తప్పక వరిస్తుంది
సినీ విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత – టాలీవుడ్ లో విషాదం
Jai Gangavva