గణపతి బప్పా మోరియా అనే పదానికి అర్ధం మీకు తెలుసా ?

0
923
గణపతి బప్పా మోరియా అని వినాయక చవితి వేడకల్లో అని అందరు అనడం మనం వింటూ ఉంటాము . మరి ఆ మోరియా అనే మాటకు అర్ధం ఎంత మందికి తెలుసు . మోరియా అనే పదం ఎలా వాడుకలోకి వచ్చింది దాని వివరాలు ఏంటో చూద్దాం
గణపతి బప్పా మోరియా
మోరియా అనే పదం వెనుక కథ

మోరియా గోసాని అనే సాధువు 15వ శతాబ్దంలో ఉండేవాడట. మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడ్ అనే గ్రామంలో ఆ సాధువు నివసించేవాడు. ఆయనగణేశుడికి చాల పరమ భక్తుడు. అయన చించ్ వాడ్ నుంచి మోర్ గావ్ కు గణపతిని పూజించేందుకు రోజూ కాలినడకన వెళ్లేవాడు.ఒక రోజు మోరియా గోసాని అనే సాధువు నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించాడు .

ఆ గణేశుడు సదువుతో సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ,దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. వెంటనే మోరియా నదికి వెళ్లి చూసేసరికి గణపతి చెప్పినట్టుగానే అక్కడ వినాయకుడి విగ్రహం ఉందంట .స్వామి ఆ సాధువుకు కలలో కనబడటం విగ్రహం తెమ్మనడం ఆనోటా,ఈనోటా పది స్థానికులకు తెలిసింది

ప్రజలు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాబట్టే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపించాడు అనుకుంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా ఱవడం మొదలుపెట్టారట . మోరియా గోసావి పాదాలను తాకి మోరియా( గోసావి మంగళమూర్తి )అంటూ మొక్కారట. గణపతికి మోరియా గొప్ప భక్తుడు కాబట్టి అప్పటి నుంచి గణపతి ఉత్సవాల్లో ఆయన ఒక భాగమైపోయాడు. అప్పటినుండి నుంచి గణపతి బప్పా మోరియా నినాదం కొనసాగుతోంది.

కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎందుకు వెళ్ళాడు …. 8 రోజులు ఉండి ఏమిచేసారు ? Secret