గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేస్తున్నారా .అయితే ఈకొత్త రూల్స్ ఖశ్చితంగా తెలుసుకోవలసిందే . నవంబర్ 1 నుండి సిలిండర్ బుకింగ్ రూల్స్ మారుతున్నాయి . ఏయే అంశాలలో రూల్స్ మారుతున్నాయి అంటే

గ్యాస్ సిలిండర్ బుకింగ్
గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ముఖ్యంగా ఈ నేలనుండి మారుతున్న నిబంధనలు తెలుసుకోవాలి . అవును సిలిండర్ వినియోగానికి సంబందించిన నిబంధనలు మారాయి . నవంబర్ నుండి ఆ నిబంధనలు అమలులోకి రానున్నాయి .
- గ్యాస్ సిలిండర్ వినియోగ దారులకు డెలివరీ చేసే సిస్టం లో మార్పులు చేసారు . మనం గ్యాస్ బుక్ చేసిన తరువాత డెలివరీ బాయ్ సిలిండర్ తెస్తాడు . అప్పుడు మనం గ్యాస్ కంపెనీ లో రిజిస్టర్డ్ చేసిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది . ఆ ఓటీపీ చెపితేనే డెలివరీ బాయ్ సిలిండర్ ఇస్తాడు .
- మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ లేకపోయినా , లేదా అడ్రెస్స్ తప్పుగా ఉన్న వెంటనే అప్డేట్ చేసుకోండి . లేకపోతె సిలిండర్ డెలివరీ లో ఇబ్బందులు ఎదురుకొనవచ్చు . కంపెనీలు కూడా మీ సమాచారాన్ని అప్డేట్ చెపుతున్నాయి . కరెక్ట్ గా చేసుకునే వరకు డెలివరీ కూడా ఆపే అవకాశం ఉంది .
- గ్యాస్ సిలిండర్ బుకింగ్ నంబర్స్ కూడా కొన్ని కంపెనీలు మార్చే అవకాశం ఉంది . ఇండియానే గ్యాస్ కంపెనీ ఇప్పుడు బుకింగ్ కి దేశ వ్యాప్తంగా ఒకే నెంబర్ ఏర్పాటు చేసింది . మనం మన కంపెనీ నెంబర్ కూడా ఒక సారి చూసుకుంటే మంచిది .
- ప్రతి నెల ఒకటో తారీకు సీలిండర్ల ధర మార్పు చెందుతూ ఉంటుంది . నవంబర్ లో కూడా గ్యాస్ ధర పెరగవచ్చు లేదా పాత దార కొనసాగవచ్చు .
Also Read