గ్రేటర్ ఎన్నికలు ప్రచారానికి ఈసీ మార్గదర్శకాలు విడుదల చేసింది . కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణం గా ప్రచార నియమాలు రూపొందించింది . చలికాలం కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది .

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు దానికి సంబందించిన అన్ని చర్యలు తీసుకుంటుంది . ఈసారి గ్రేటర్ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో నిర్వహించనున్నారు . ఈసీ అభ్యర్థి పాటించవలసిన రూల్స్ కూడా రూపొందించింది .
అభ్యర్థికి 5 లక్షల పరిమితిని విధించింది . ఎన్నికలు ముగించిన 45 రోజులలోపు ఖర్చుకు సంబంధించి వివరాలు సమర్పించాలి అని తెలిపింది . ప్రచారానికి అభ్యర్థి రెండు వాహనాలలోనే వెళ్ళాలి . అంతకంటే ఎక్కువ వాహనాలు వాడరాదు . అందరు ప్రచార సమయంలో భౌతిక దూరం పాటించాలి . ఇంటింటి ప్రచారానికి ఐదుగురు సభ్యులు భద్రతా సిబంది మాత్రమే వెళ్ళాలి .
రోడ్ షో కు మధ్య అరగంట గ్యాప్ ఉండాలి . బహిరంగ సభకు అనుమతిలేదు . ఈ నియమాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ వెల్లడించింది .
బీజేపీ ఎలాగయినా గ్రేటర్ లో జెండా ఎగుర వేయాలని చూస్తుంది . దుబ్బాక విజయం తరువాత బీజేపీ మంచి ఉత్సహంతో ఉంది .ప్రజలు కూడా తెరాస బీజేపీ మధ్యే పోటీ అన్నటుగా చూస్తున్నారు . మరి అధికార పార్టీ ఈసారి కూడా విజయం మాదే అని , మా పని పట్ల ప్రజాలు సంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు . బీజేపీ ,జనసేన కలసి గ్రేటర్ లో పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది .
AlsoRead