చంద్రుడిపై స్థలం గిఫ్ట్ : 2 నెలల కొడుకు కి కొనిచ్చిన వ్యాపారి- Awesome

0
1946
చంద్రుడిపై స్థలం గిఫ్ట్ గా రెండు నెలల కొడుకు కి ఇచ్చి వార్తలలో కెక్కిన వ్యాపారి . అందరు చిన్న పిల్లలకు అన్నం తినిపిస్తూ జాబిల్లిని చూపిస్తారు ,కానీ సూరత్ కి చెందిన వ్యాపారి ఏకంగా చంద్రుడిపైనే స్థలాని కొని కొడుకు కి ఇచ్చాడు .
చంద్రుడిపై స్థలం గిఫ్ట్

గుజరాత్ లోని సూరత్ కి చెందిన వ్యాపారి విజయ్ భాయ్ కథరియా చంద్రుడిపై స్థలం కొని రికార్డ్ లాకెక్కాడు . మాములుగా తలి తండ్రులు పిల్లలకు స్థలాలనో , పొలాలనో లేక డబ్బు రూపంలోనో ఆస్తులుగా ఇస్తారు . కానీ విజయ్ మాత్రం తన కొడుకు కు డిఫరెంట్ గా చంద్రుడిపై స్థలాన్ని కొని చ్చాడు .

మాములుగా ఫ్యూచర్ లో చంద్రుడిపై నివాసం ఉండవచ్చు అని ప్రయోగాలు జరుగుతున్నాయి . ఇప్పుడు అయితే అక్కడ ఇల్లు కట్టలేము . కానీ స్థలం మాత్రం కొనవచ్చు .దానిని సర్టిఫికెట్ రూపంలో పొందవచ్చు . వ్యాపారికిఈ ఆలోచన రాగానే అది ఎలా కొనాలి అని ప్రయత్నం కొనసాగించాడు . చంద్రుడిపై స్థలం కోసం అమెరికాలోని ఇంటర్నేషనల్ లూనార్ రిజిస్ట్రీకి మెయిల్ చేసాడు . అక్కడి నుండి అనుమతులు వచ్చాయి . ఆ కంపెనీ విజయ్ తన రెండు నెలల కొడుకు నిత్య పేరుమీద ఒక ఎకరం స్థలం కొన్నారు అని సర్టిఫికెట్ కూడా పంపారు .
చంద్రుడిపై సీ ఆఫ్ మాస్కోవి అనే ప్రాంతంలో విజయ్ కి స్థలం కేటాయించారు . మాములుగా చంద్రునిపై స్ధలం కొనాలి అంటే అంత సులభమైన విషయం కాదు . కానీ వ్యాపారి విజయ్ తన కొడుకు కోసం సాధించాడు . జాబిల్లిపై స్థలం కొన్నారు అనుమతులు రావడంతో వ్యాపారి విజయ్ అందంతో ఉబ్బితబ్బిపోయాడు .

కోటీశ్వరాలుని చేసిన నత్త : 160rs లనత్తలు వండడానికి తెస్తే జీవితాన్నే మార్చేసింది- Wow