జీహెచ్ఎంసి కొత్త మేయర్ఎవరు అనేది ఆలోచన అందరిలో మొదలయింది . ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ కూడా తుది దశ చేరుకునేసరికి ఇప్పుడు అందరి దృష్టి కొత్త మేయర్ ఎవరు కాబోతున్నారా అనే దానిపై పడింది . ఈసారి మేయర్ పదవి మహిళలకు రావడం కూడా ఆసక్తిని పెంచింది .

జీహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ మొదలు అయినప్పటినుండి బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే ఉంది . మొదట పోస్టల్ బ్యాలట్ లెక్కిపు మొదలు పెట్టారు. దానిలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించింది . బ్యాలట్ బాక్స్ ఓట్ల లెక్కిపు మొదలు పెట్టిన తరువాతకూడా తెరాస స్వల్ప ఆధిక్యాన్ని మాత్రమే కోన సాగించింది . ఎంఐఎం ఎగ్జిట్ పోల్ ప్రకారం సీట్లను సాధించింది . బీజేపీ ఎగ్జిట్ పోల్ చేపిందానికంటే అనూహ్యంగా సీట్లను సాధించింది .
148 స్థానాలను ప్రకటించగా తెరాస 56, బీజేపీ 47, ఎంఐఎం 43, కాంగ్రెస్ 2, సీట్లను సాధించాయి . ఏపార్టీకి మేజిక్ ఫిగర్ రాలేదు . హంగ్ దిశగా గ్రేటర్ . ఎంఐఎం కలుపుకొని తెరాస మేయర్ పీఠం దక్కించుకుంటుండా అనేది చూడాలి . సీఎం కేసీఆర్ మాత్రం ఎంఎల్సీ భూపాల్ రెడ్డి కోడలు 111 డివిజన్ భారతి నగర్ సింధు రెడ్డి ని ప్రగతి భవన్ రావలసిందిగా పిలుపు నివ్వడంతో అందరికి మేయర్ గా అవకాశం ఇవ్వటానికే అని అందరిలో ఆలోచన పెరుగుతుంది .
నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఫెస్ట్ ఉచితంగా ప్రేక్షకులు డిసెంబర్ 5,6 తేదీలలో