జీహెచ్ఎంసి 2020: ఎన్నికలలో రోడ్ షోలు ఫుల్ …వోటింగ్ నిల్- Strange

0
786
జీహెచ్ఎంసి 2020 హైద‌రాబాద్ ఎన్నికలలో వోటింగ్ వేయడానికి ప్రజలు ఎక్కువగా రాకపోవడంతో పోలింగ్ బాతులు వెలెవెలెబోయాయి . కరోనా ప్రభావంచేతనో లేక బాధ్యత మరచిపోయారో మొత్తానికి వోటింగ్ శాతం చాల తగ్గింది అని చెప్పుకోవచ్చు .
జీహెచ్ఎంసి 2020

ఎన్నికల ప్రచారంలో ఏపార్టీ నాయకుడు రోడ్ షోలు నిర్వహించిన జనాలు వేళా సంఖ్యలో రోడ్లపైకి వచ్చి జేజేలు పలికారు . కానీ తీరా వోటువేసే రోజు రాగానే ఆ ప్రజలు ఎక్కడ కనిపించకుండా పోయారు . వోటింగ్ వేయాలనే ఆలోచన కూడా రాలేదోమో పోలింగ్ సెంటర్ల వైపు కూడా చూడలేదు కాబోలు . ఉదయం ఏడు గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యానికి కేవ‌లం 25.35 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదైంది.ఐటి ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువ‌గా ఉండే హైద‌రాబాద్ మ‌ధ్య ప్రాంతంలో 10 శాతం దాటేందుకు అప‌సోప‌నాలు ప‌డుతున్నది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మాదాపూర్, గచ్చిబౌలి, పాతబస్తీ, తదితర ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు. శివారు ప్రాంతాల్లో ఉన్న వోటింగ్ శాతం సిటీలో లేకపోవడం శోచనీయం . పోలింగ్ బూత్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోతున్నారు.

మొత్తంగా గుడిమల్కార్‌పూర్‌లో అత్యధికంగా 49.19శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా రెయిన్‌బజార్‌లో అరశాతం (0.56)శాతం నమోదయ్యింది.
మిగితా ప్రాంతాల వారీగా పోలింగ్ శాతం చుస్తే

కొండాపూర్- 9.98%
రాజేంద్రనగర్- 9.90%
విజయనగర్ కాలనీ- 9.0 %
ఆల్విన్‌ కాలనీ- 3.85%
సోమాజిగూడ- 2.77%
అమీర్‌పేట్- 0.79%
కొండాపూర్- 9.98%
బంజారాహిల్స్- 21.36%
మాదాపూర్- 13.54 %
జూబ్లీహిల్స్- 12.47%
కూకట్‌పల్లి- 12.37 %
చందానగర్- 31.08%
హిమాయత్ నగర్- 18.17%
కాచిగూడ – 20.97%
నల్లకుంట-30.62%
గోల్‌నాక -23.47%
అంబర్‌పేట్ -24.94%
బాగ్ అంబర్‌పేట్- 28.00%
నాగోల్ – 35.24 %
మన్సూరాబాద్ – 34.06 %
హాయత్ నగర్ – 35.62 %
బీఎన్ రెడ్డి నగర్ – 34.23 %

Also Read

నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఫెస్ట్ ఉచితంగా ప్రేక్షకులు డిసెంబర్ 5,6 తేదీలలో