జీహెచ్ఎంసీ మాజీ మేయర్ : బీజేపీ లో చేరిన కార్తికా రెడ్డి- Surprise

0
855
జీహెచ్ఎంసీ మాజీ మేయర్

జీహెచ్ఎంసీ మాజీ మేయర్ కాంగ్రెస్ నాయకురాలు ఆయన బండ కార్తికా రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చింది . రెండు రోజులుగా వస్తున్నా వార్తలను నిజం చేస్తూ ఆమెతో పాటు ఆమె భర్త పార్టీ మారారు .

జీహెచ్ఎంసీ మాజీ మేయర్

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఆశావహులు అందరు పార్టీ కార్యాలయాల చుట్టూ చేరిపోయారు . అలాగే కొందరు ఏపార్టీకి వెళ్తే ఎలావుంటుంది అన్న దిశలో కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం . ఇది ఇలా ఉండగా రెండురోజులుగా వస్తున్నా వార్త బండ కార్తీక పార్టీ మారుతుంది అని . దానిని నిజంచేస్తూ ఇవాళ బీజేపీ లో చేరింది .

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ కార్తీక రెడ్డి ,ఆమె భర్త చంద్రా రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ అవినీతి ప్రభుత్వాన్ని తొలగించడమే మా లక్ష్యం అన్నారు . పేదలకు ఇస్తానన్న రెండు పడకల గది ఎక్కడ అని వారు తిరుగుతున్నారు అని ఎద్దేవా చేసారు . గ్రేటర్ పదవి మేము అందుకోబోతున్నాం అని అన్నారు .

కార్తీక రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు సీటు ఇవ్వకుండా మోసం చేసింది అన్నారు . సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న బీజేపీ లో న్యాయం జరుగుతుంది అని ఈ పార్టీలో చేరాను అన్నారు . జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తెరాస కు ప్రత్యామ్నాయం బీజేపీ అని , జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేయడం లేదని తెలిపారు . బీజేపీ తరుపున అన్ని డివిజన్ లలో ప్రచారం చేస్తానని అన్నారు .

Also Read

కార్తీక మాసం 2020 విశిష్టత చేయవలసిన పూజలు- Special