జీ హెచ్ ఏం సి ఎన్నికల నోటిఫికేషన్ ను తెలంగాణ ఎన్నికల అధికారి పార్థ సారథి విడుదలచేశారు . తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లలో గెలుపొందిన ప్రస్తుత పాలక వర్గం గడువు ముగుస్తుండడం తో నోటిఫికేషన్ విడుదల చేసారు .

ఎన్నికల కమిషనర్ పార్థ సారథి మీడియా తో మాట్లాడుతూ 2021 ఫిబ్రవరికి ప్రస్తుత పాలక వర్గం గడువు ముగుస్తుంది అని తెలిపారు . ఆలోపు ఎన్నికలు నిర్వహించాలి కనుక షెడ్యూల్ ని విధుల చేస్తునట్టు తెలిపారు . 2016 లో ఏవయితే రిజర్వేషన్ లు ఉన్నాయో వాటి ప్రకారమే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు .ఎలక్షన్స్ డిసెంబర్ 1 న నిర్వహించి డిసెంబర్ 4 న కౌంటింగ్ నిర్వహించ నున్నారు .
ఓటర్ల జాబితాపై అన్ని పార్టీ లతో చర్చించిన తరువాతే తుది నిర్ణయం తీసుకున్నామని చెప్పారు . డిజిపి ,సిపి లతో బందో బస్తు గురించి చర్చించాము . ఎన్నికల కు సంబంధించి అన్ని విధాలుగా రెడీ గా ఉంన్నాము అని తెలిపారు . అలాగే ఈ జీ హెచ్ ఏం సి ఎన్నికల ను బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Also Read