జూనియర్ ఎన్టీఆర్ రహదారి భద్రత మాసంలో భావోద్వేగభరితముగా మాట్లాడారు . జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు . ఎన్టీఆర్కు పోలీసులు ఘన స్వాగతం పలికారు.

కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో నేను కూడా ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయాను. ఇక్కడికి ఓ నటుడిగా రాలేదు,ఓ పౌరుడిగా ఇక్కడకు వచ్చాను అని భావోద్వేగభరిత ప్రసంగం చేసారు . అందరు ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలను పాటించాలి అని సూచించారు .
అందరి అవగాహన కోసం పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపాడు. రహదారులపై అందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి మళ్లీ సురక్షితంగా ఇంటికి వెళ్లాలని పిలుపునిచ్చాడు. మనతో మన కుటుంబం ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి అని అన్నారు . సైబరాబాద్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలను టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.