జ్యోతి రంజన్ బాగర్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు . సెక్యూర్టీ గార్డ్ గా పనిచేస్తూనే సివిల్స్ లో ఉత్తీర్ణుడు అయ్యాడు . 14 ఏళ్లుగా కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు . బీద కుటుంబంలో పుట్టాను అని అతను ఎప్పుడు బాధపడలేదు . ఏదో సాదించాలి అని మాత్రమే అనుకున్నాడు .
డిగ్రీ కూడా లేని అతను సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూనే ప్రైవేట్ లో డిగ్రీ పాస్ అయ్యాడు . ఆతరువాత ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు . తనలో ఇంకా చదువుకోవాలి అనే తపనతో ఏకంగా సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాడు .
కుటుంబమే కోసం ఒకయూపు ఉద్యోగం చేస్తూనే ,పట్టుదలతో చదివి ఎవరు ఊహించని విధంగా ఐఏఎస్ లో విజయం సాదించాడు . ఇప్పుడు ముస్సోరి లో శిక్షణ పొందుతున్నాడు .
జ్యోతి రంజన్ బాగర్తి ఇప్పుడు అందరికి ఆదర్శం గా నిలుస్తున్నాడు . చాలామంది నాకు అదీలేదు ,ఇది లేదు అని ఏపని చేయకుండా వదిలేస్తూఉంటారు . కానీ మనం అనుకున్న పనిని పట్టుదలతో అన్ని సమస్యలను అధిగమించి వెళ్తే ఏదయినా సాధించవచ్చు అని ఇతని ద్వారా మన తెలుసుకోవచ్చు .
Also Read