టీఎస్ ఆర్టీసీ కరోనా కష్టాలతో ఉన్న ప్రయాణికులకు సంతోషం అయిన వార్తను శుక్రవారం ప్రకటించింది .

లాక్ డౌన్ కారణంగా బస్ పాస్ ఉపయోగించుకొని వారికీ మల్లి వినియోగించుకునే సదుపాయం కల్పించనుంది .కోవిద్ లొక్డౌన్ ముందు తీసుకున్న బస్ పాస్ అంటే ఆర్డినరీ ,మెట్రో ఎక్సప్రెస్, మెట్రో డిలక్స్, ఎయిర్ పోర్ట్ పుష్పక్ ఏసీ బస్ లకు సంబందించిన పాస్ లు లాక్ డౌన్ లో ఎన్నిరోజులు వినియోగించు కోలేదో ఇప్పుడు ఆ బస్ పాస్ ను మల్లి వినియోగించు కోవచ్చు .ఈఅవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ టీఎస్ ఆర్టీసీ కల్పిస్తుంది .
వినియోగదారులు చేయవలసిందల్లా అప్పటి బస్ పాస్ ను కౌంటర్ లో ఇచ్చి కొత్త పాస్ తీసుకోవలసిందిగా ఆర్టీసీ కోరింది . మనం ఉపయోగించని రోజులు కలిపి కొత్త పాస్ జారీ చేస్తారు .ఈ సదుపాయం నవంబర్ 30 వరకు ఉంటుంది .
Also Read
జ్యోతి రంజన్ బాగర్తి : సివిల్స్ సాధించిన సెక్యూరిటీ గార్డ్ – Wow