ట్రంప్ ట్రూత్ సోషల్ : అన్నట్టుగానే ట్విట్టర్ కు పోటీగా ప్రవేశపెట్టనున్న ట్రూత్ సోషల్- Prestige

0
1159
ట్రంప్ ట్రూత్ సోషల్( TRUTH SOCIAL): ట్రంప్ అన్నది అన్నట్టుగా చేస్తాడు అనేది మరోసారి రుజువుచేసాడు . తనను బ్యాన్ చేసిన సోషల్ మీడియా స్థానంలో సొంతంగా సోషల్ మీడియా(SOCIAL MEDIA) మాధ్యమాన్ని తీసుకువస్తానని ఇంతకు ముందు ప్రకటించాడు . తాజాగా ఆవిషయమై సంచలన ప్రకటన చేసాడు .
ట్రంప్ ట్రూత్ సోషల్

అధ్యక్ష ఎన్నికలలో ఓటమి అంగీకరించని ట్రంప్(TRUMP) తన అభిమానులతో క్యాపిటల్ భావం మీద దాడి చేయించాడు . అప్పుడు హింసాత్మక సంఘటనలు జరిగాయి . ఆ దాడిలో 5 గురు చనిపోయారు . ఈ సంఘటనతో సామజిక మద్యమాలు అన్ని ఒకొక్కటిగా అన్ని ట్రంప్ ను బ్యాన్ చేసాయి . దానితో ట్రంప్ సొంత సోషల్ మీడియా మాద్యమాన్నీ తీసుకువస్తానని ప్రకటించాడు .
తాజాగా ట్రంప్ సొంత సామజిక మాధ్యమాన్ని ప్రకటించాడు . ‘ట్రూత్ సోషల్ ‘ పేరుతొ వస్తున్నా సోషల్ మీడియా యాప్ ను వచ్చే నెలలో తీసుకు వస్తున్నట్లు తెలిపాడు . దానితో పాటు తాను తీసుకు వస్తున్నా ఈ మాధ్యమం ట్విట్టర్ , పేస్ బుక్ కి గట్టి పోటీని ఇస్తుందని అన్నారు . దీని కోసం ఇప్పటికే ట్రంప్ టీం TMTG – డిజిటల్ వరల్డ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి .

Trump మాట్లాడుతూ ‘ ట్విటర్ లో తాలిబన్ లు చాలా మండే ఉన్నారు కానీ మీ అభిమాన అధ్యక్షుడికి మాత్రం స్థానము లేదు .ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం , ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా నిజాయితీగా సందేశాలను పంచుకోడానికి నేను ఎదురు చూస్తున్న అందరికి మాట్లాడే అవకాశం ఇవ్వడానికే ఈ TMTG యెర్పటు చేశామని చెప్పారు .

ఇంటర్ పరీక్షలు 2021 : తేదీలను రీషెడ్యూల్ చేసిన విద్యాశాఖ