డబుల్ బెడ్రూమ్ ఇల్లు .. నాకు వద్దు అన్న మహిళా- Rare

0
863
డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టాతో ఇంటికి వచ్చిన అధికారులతో సిద్దిపేటకు చెందిన లక్ష్మి నాకు ఇల్లు వద్దు అని తెలిపింది . సదరు మహిళా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వద్దు అనడంతో అధికారులు ఆశ్చర్య పోయారు . తరువాత ఆ మహిళా ఎందుకు ఇళ్లు వద్దు అన్నాడో తెలిసి అభినందించారు .
డబుల్ బెడ్రూమ్ ఇల్లు

ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇల్లు ఎప్పుడు తమకి అందుతుందో అందరు ఎదురు చూస్తుంటే ఇళ్ల పట్టాతో వచ్చిన అధికారులతో సిద్దిపేటకు చెందిన మహిళా నాకు ఇల్లు వద్దు అని చెప్పడం వార్తల్లో ఇప్పుడు వైరల్ గా మారింది . అయితే అసలు విషయం తెలుసుకున్న అధికారులు ఆమె మనసు మెచ్చి శాలువా కప్పి గౌరవించారు .
శుక్రవారం మంత్రి హరీష్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో ఇంటి పత్రాలను ప్రభుత్వానికి అప్పగించింది . ఎందుకు అనే విషయం చెపుతూ ప్రస్తుతం నేను , నాకూతురు మాత్రమే ఉంటున్నాము . రేపు నాకూతురు పెళ్లి చేసుకొని వెళిపోతే నేను ఒక్క దానినే ఉంటాను . అప్పుడు ఒక్కదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు , ఇంకా ఎవరికి అయిన అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఉంటుంది అని అభిప్రాయపడింది .
ఇల్లు కేటాయించనందుకు ప్రభుత్వానికి , హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపింది . లక్ష్మి ఏంఎంతో పెద్ద మన్సుతో ఆలోచించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ని మంత్రి హరిశ రావు అన్నారు . లక్ష్మి చేసిన పని అందరికి ఆదర్శం గా నిలుస్తుంది అని అన్నారు .

కరోనా వాక్సినేషన్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు- Rules