డబ్బులు లేకపోతె ATM లకి ఫైన్ : ప్రతీ ATM కి 10 వేలు వసూలు చేయనున్న RBI- Breaking

0
2388
డబ్బులు లేకపోతె ATM లకి ఫైన్ : ఏంటి ఆశ్చర్యపోతున్నారా ! అవును మీరు విన్నది నిజమే . ఏటీఎం లలో డబ్బులు లేకపోతె RBI బ్యాంకులకు ఫైన్ వేయనున్నది . ఎప్పటి నుండి ఇది అమలు అవుతుంది దాని తాలూకు వివరాలు చూద్దాం .
డబ్బులు లేకపోతె ATM లకి ఫైన్

మనం ఎప్పుడు ఏటీఎం కి వెళ్లిన చాల సార్లు అవి పనిచేయకపోవడం లేక డబ్బులు లేవు అని బోర్డు పెట్టడమో చూస్తూ ఉంటాము . అయితే ఏటీఎం లలో నగదు లేకపోవడాన్ని RBI తీవ్రంగా పరిగణించింది . డబ్బులు లేకపోతె ATM లకి ఫైన్ వేయాలని నిర్ణయించింది . ఖాళీ ఏటీఎంలు ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది . అక్టోబర్ 1 నుండి ఏటిఎంమ్ లలో నగదు లేకపోతె 10,000 రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది .

ATM లలో నగదు ఎప్పటికప్పుడు నింపాలసిందేనని స్పష్టం చేసింది . 10 గంటలకు పైగా ఎన్ని ATM లలో నగదు లేకపోతె అన్నింటిపైనా 10 వేల చొప్పున ఫైన్ విధిస్తామని RBI సర్క్యూలర్ జారీచేసింది . అన్ని బ్యాంకులు ఏటీఎం లను పటిష్టం చేసుకొని ఎప్పటికప్పుడు నగదు ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని RBI తెలిపింది . RBI నిర్ణయంతో ఖాతాదారులు హర్షం వెలిబుచ్చుతున్నారు .

Egg Burger : how to make at home .. simple recipe-