డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన 12 అవార్డులలో నాలుగు అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక పోలీస్ శాఖ నిలిచింది .
ఎపి డిజిపి గౌతం సవాంగ్ IPS నాలుగు టెక్నాలజీ అవార్డులను అందుకున్నరు .

ఏపీ పోలీస్ శాఖ మొత్తం 4 విభాగాలలో దిశ మొబైల్ అప్లికేషన్, దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, సెంట్రల్ లోక్ అప్ మానిటరింగ్ సిస్టం,4S4U అవార్డులను సొంతం చేసుకున్నది .
దిశ మొబైల్ అప్లికేషన్ మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది . ఇప్పటికే ఈ యాప్ వివిధ జాతీయ స్థాయి సంస్థలు ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డులలో ఇది నాల్గవది.
వివిధ జాతీయ స్థాయి సంస్థల నుండి దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ ఇప్పటికే రెండు అవార్డులను సొంతం చేసుకుని ప్రధాన మంత్రి నుండి ప్రత్యేకంగా ప్రశంసలను అందుకుంది.
సెంట్రల్ లాక్ అప్ మానిటరింగ్ సిస్టం వినియోగంలో రెండవ సారి జాతీయ స్థాయిలో అవార్డును సొంతం చేసుకున్న ఏపీ పోలీస్ శాఖ. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ లో పారదర్శకత, జవాబుదారీతనం, మానవహక్కుల పరిరక్షణే ధ్యేయంగా లాకప్ లో ఆడియో, వీడియో, నైట్ విజన్లతో కూడిన సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది .
4S4U : ఏపి పోలీస్ ప్రవేశపెట్టిన 4S4U మరోసారి జాతీయ స్థాయి అవార్డు దక్కించుకుంది. సామాజిక మద్యమాల్లో మహిళల పైన జరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణ కోసం ఇది ఏర్పాటు చేయడం అయింది .
112 అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో కేవలం 13 నెలల కాల వ్యవధిలోనే అవార్డులను సొంతం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించిన ఏపీ పోలీస్ శాఖ. మెరుగైన సేవలను అందిస్తున్న సిబ్బందిని అభినందించిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత.