gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES డిజిటల్ పాఠాలు అందరికి సాధ్యమేనా

డిజిటల్ పాఠాలు అందరికి సాధ్యమేనా

డిజిటల్ పాఠాలతో సెప్టెంబర్ ఒకటినుండి తెలంగాణ ప్రభుత్వం విద్య సంవత్సరం మొదలుపెట్టాలని నిర్ణయించింది . దూర దర్శన్ , టీ శాట్ లలో ప్రసారం చేసి విద్యార్థులకు అందించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు . ఉపాధ్యయులను అందుకు తగిన విషయాలను పరిశీలించాలసిందిగా అధికారులు ఆదేశించారు . కానీ క్షేత్ర స్థాయి పరిస్థితులను చుస్తే ఇది అంత సులువుగా జరిగే పనిగా అనిపించటం లేదు. అధికారులు కూడా అంతర్గతంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది .

డిజిటల్
DIGITAL CLASSES

క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చుస్తే

మొత్తం రాష్ట్రంలో పాఠశాలలు సుమారు 25000. దీనిలో చదివే వారి సంఖ్య లెక్కల ప్రకారం 22 లక్షలు . ఇప్పుడు ప్రభుత్వం డిజిటల్ క్లాసులు three నుంచి 10 వ తరగతివారికే అనిచెప్పింది.ఈ విధంగా చుస్తే విద్యార్థుల సంఖ్య దాదాపు 18 లక్షలుగా ఉంటుంది . సమాచారం ప్రకారం దీనిలోని 1. 70 లక్షల మందికి ఇంట్లో టీ వీ లు లేవని తెలుస్తుంది . ప్రభుత్వం మొదట యూట్యూబ్ పాఠాలు మొదలు పెట్టాలని ,అనుకున్నప్పటికీ స్మార్ట్ ఫోన్ లు అందరికి అందుబాటులో ఉండక పోవచ్చని , మారుమూల గ్రామాల్లో అసలు ఇంటర్నెట్ సౌకర్యం కూడా కష్టం అని అలోచించి దూర దర్శన్ లో చెప్పాలని నిర్ణయించింది . కానీ ఇక్కడ కూడా టీ వీ సౌకర్యాలు లేకపోవడంతో కొంత సమస్య వున్నారు తెలుస్తుంది . డిష్ టీవీ లు వున్నా వాటిలో టీ శాట్ ప్రసారం కావడంలేదు . విద్యాశాఖ మార్గదర్శకాలలో టీవీ లేనివారు పంచాయితీ లో చూడవచ్చని ,లేదా తోటి విద్యార్థుల ఇంట్లో ప్రమాణాలు పాటిస్తూ చూడాలని చెబుతున్నారు . కానీ స్కూల్స్ లో అనుమతించవద్దని ఒకరిద్దరిని అనుమతి ఇస్తే అందరు అదే సాకుతో వస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం వుంది అని అధికారులు చెప్తున్నారు .

         ప్రభుత్వం చెపితే కేబుల్ ఆపేరేటర్స్ టీ శాట్ ని ప్రసారం చేసే అవకాశం వుంది .ఎందుకంటే టీ శాట్ ఇటీవలే ఎయిర్టెల్ తో ఒప్పందం కుదుర్చుకుంది . ఆవిధంగా క్లాసులు వైన్ అవకాశం కూడా వుంది .ఇంతకూ ముందు వర్క్ షీట్లు అందరికి ఇవ్వాలని అనుకున్నారు కానీ ఇప్పుడు టీవీ లు స్మార్ట్ ఫోన్ లేనివారికి ఇవ్వాలని డి ఈ ఓ స్థాయి అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది . 

పాఠాలు ప్రసారమయ్యే సమయాలు

రోజు పాఠాలకు కేటాయించిన సమయం 7. 30 గంటలు . దానిలో దూర దర్శన్ 2. 30 గంటలు , టీ శాట్ 5 గంటలు ప్రసారం చేస్తాయి . దూర దర్శన్ లో ఉదయం 10. 30 గంటల నుండి ఒంటి గంట వరకు ప్రసారం చేస్తుంది మరియు టీ శాట్ ఉదయం 10 నుండి 12 గంటల వరకు ,తరువాత 2 నుండి 5 గంటల వరకు ప్రసారం చేస్తుంది . ఒకొకక్క తరగతికి గంట చొప్పున అంటే క్లాస్ 30 నిమిషములు , రెండు క్లాసులు కేటాయించారు .

ఖైరతాబాద్ గణేష్ నిమ్మజనం హుసైన్ సాగర్ లోనే -గణేష్ కమిటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments