gtag('config', 'UA-172848801-1');
Home Spiritual తిరుమల : తితిదే ఉద్యోగుల బంధమిత్రుల కోసం సుపథం దర్శనం

తిరుమల : తితిదే ఉద్యోగుల బంధమిత్రుల కోసం సుపథం దర్శనం

తిరుమల : తితిదే ఉద్యోగులు తమ బంధమిత్రులను వైకుంఠ ఏకాదశి రోజులలో 10 మందికి 300/- స్పెషల్ ఎంట్రీ సుపథం దర్శనం కల్పించాలసిందిగా తితిదే చైర్మన్ శ్రీ Y.V. సుబ్బారెడ్డి గారు మరియు స్థానిక ఎమ్యెల్యే, బోర్డు మెంబెర్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కోరడంతో సానుకూలంగా స్పందించారు .
తిరుమల

తితిదే ఉద్యోగుల బంధుమిత్రుల కోసం శ్రీవారి వైకుంఠ ఏకాదశి రోజులలో బ్రహ్మోత్సవం తరహాలో వైకుంఠ ఏకాదశి రోజులలో 10 మందికి 300/- సుపథం ఎంట్రీ దర్శనం (స్పెషల్ ఎంట్రీ) టిక్కెట్లు మంజూరు చేయాలని తితిదే చైర్మన్ గారిని మరియు స్థానిక ఎమ్మెల్యే గారిని తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ నందు తితిదే ఉద్యోగ సంఘ నాయకులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ గారు సానుకూలంగా స్పందించి ఉద్యోగులకు వైకుంఠ ఏకాదశి టికెట్ల పై అధికారులతో చర్చించి ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.


ఇళ్ల స్థలాలు, క్యాషులెస్ మెడికల్ ట్రీట్మెంట్, టెంపరరీ పోస్టులను రెగ్యులర్ చేయడానికి సంబంధించి మొదలైన సమస్యలపై వైకుంఠ ఏకాదశి అనంతరం స్థానిక ఎమ్యెల్యేలు, తితిదే ఉన్నంతధికారులు మరియు తితిదే ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తితిదే ఉద్యోగ సంఘ నాయకులు గోల్కొండ వెంకటేశం, గంపల వెంకటరమణా రెడ్డి, డా.ప్రసాదరావు, జె. భాస్కర్, కె. ఇందిర, ఎస్. కల్పన, చీర్ల కిరణ్, ఆంజనేయులు, లోకాచారి సురేష్, రవి కుమార్, శ్రీనివాసులు, గిరిజ తదితరులు పాల్గొన్నారు.

భక్తులపై లాఠీచార్జి అవాస్తవం

అలిపిరి టోల్ గేట్ వద్ద భక్తులపై టీటీడీ పోలీసులతో లాఠీ చార్జి చేయించిందని ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు సామాజిక మీడియా ద్వారా చేసిన ఆరోపణలు అవాస్తవమని టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది. దర్శనం టోకెన్లు లేని భక్తులు టోల్ గేట్ వద్దకు రాగా పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు వారికి సర్ది చెప్పి పంపారని తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో టోకెన్లు, టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించబోమని చాలా రోజుల నుంచి ప్రచార, ప్రసార సాధనాల్లో భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తూనే ఉంది.
అన్నమయ్య మార్గంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆకేపాటి అమరనాథ రెడ్డి తో పాటు వస్తున్న వారు పాప వినాశనం అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు, వీడియో తీస్తున్నారని సమాచారం అందగానే విజిలెన్స్ అధికారులు వెళ్లి వాటిని సీజ్ చేశారు.

కొత్త కరోనా స్ట్రైన్ 70శాతం వేగంగా విస్తరిస్తుంది … మార్పుచెందడం అంటే ? Strange

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments